Minister Atchannaidu : అమరావతి – రొయ్యల రైతులకు ప్రభుత్వం పూర్తి సహకరం ఉంటుందని స్పష్టం చేశారు మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu). మంత్రి అధ్యక్షతన బుధవారం సచివాలయంలో ఆక్వాకల్చర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ తొలి సమావేశం జరిగింది. సమావేశంలో పలు ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ఆక్వాకల్చర్ యూనిట్లు తప్పనిసరిగా రిజిస్టర్ కావాలని ఆదేశించారు అచ్చెన్నాయుడు. లైసెన్స్ జారీ ప్రక్రియను సులభతరం చేయాలని అధికారులకు సూచించారు. రిజర్వాయర్లలో కేజ్ కల్చర్ ద్వారా 5 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి పెంపు లక్ష్యంగా ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు.
Minister Atchannaidu Key Comments
రాష్ట్ర మత్స్యరంగ అభివృద్ధి, సుస్థిరమైన అక్వాకల్చర్, రైతుల ఆదాయ పెంపు, దేశీయ మార్కెట్ బలోపేతం వంటి లక్ష్యాలకు తోడ్పడతాయని పేర్కొన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. రొయ్యల రైతులకు కూటమి ప్రభుత్వం నుండి సంపూర్ణ మద్దతు ఇస్తామన్నారు. ధరల స్థిరీకరణ కోసం ప్రయత్నం చేస్తామని చెప్పారు మంత్రి. ఆక్వా రైతులకు మేలు జరిగేలా సుంకాల భారంపై సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారని పేర్కొన్నారు.
సుంకం తక్కువ ఉన్న దేశాలకు రొయ్యలను ఎగుమతి చేస్తే రైతులకు నష్టం వాటిల్లదన్నారు అచ్చెన్నాయుడు. చికెన్ వ్యర్ధాలను చేపల చెరువలకు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చెరువుల యజమానులపై కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ ఇటీవల ఇండియాపై 50 శాతం సుంకాలను విధించారు. దీని కారణంగా ఏపీకి చెందిన రొయ్యల రైతులకు తీరని నష్టం ఏర్పడుతుందన్నారు.
Also Read : MP Kesineni Sivanath Alarming : లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
















