Deputy CM Bhatti : హైదరాబాద్ – రాష్ట్రంలో రూ. 22 వేల కోట్ల వ్యయంతో ఒక్కో అసెంబ్లీ స్థానంలో 3 వేల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతున్నట్లు ప్రకటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 94 లక్షల కుటుంబాలు లబ్ధి పొందేలా రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 10 లక్షల సాయం చేస్తామన్నారు. రూ. 6 వేల కోట్ల విలువైన 189 కోట్లు ఉచిత బస్సు టికెట్లు ఇచ్చామన్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని తెలిపారు. 93.7 లక్షల కుటుంబాలు సన్నబియ్యం పంపిణీ చేశామని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలకు రూ. 95,351 కోట్లు ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు.
Deputy CM Bhatti Interesting Comments
మంగళవారం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Bhatti) మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం ప్రజా పాలన చేపడుతుందోని చెప్పారు. ప్రతిపక్షాలు కావాలని రాద్దాంతం చేస్తున్నాయని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చేలా కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు ఖజానాపై భారం పడుతున్నా ఎక్కడా లెక్క చేయడం లేదన్నారు మల్లు భట్టి విక్రమార్క.
ఎన్ని జిమ్మిక్కులు చేసినా వారి ఆటలు సాగవన్నారు. వారి ప్లాన్స్ వర్కవుట్ కావన్నారు డిప్యూటీ సీఎం. తాము దేశంలో ఎక్కడా లేని రీతిలో తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు మల్లు భట్టి విక్రమార్క. ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారని ఇందులో ఎలాంటి సందేహం ఉండాల్సిన అవసరం లేదన్నారు.
Also Read : Amla Interesting Benefits : ఏంటి రోజూ ఉసిరి రసం తాగితే ఇన్ని ఉపయోగాలా..


















