Israel : పశ్చిమాసియా మరోసారి రగులుతోంది. ఇరాన్ రాజధాని ట్రెహాన్‌పై ఇజ్రాయెల్ భీకరంగా విరుచుపడింది. ఇరాన్ న్యూక్లియర్, మిలటరీ స్థావరాలపై శుక్రవారం జరిపిన దాడుల్లో ఆ దేశానికి చెందిన ఆరుగురు ప్రముఖ అణ్వస్త్ర శాస్త్రజ్ఞులు మరణించగా.. పలువురు మిలటరీ సీనియర్ నేతలు గాయపడ్డారు. ‘రైజింగ్ లయన్’ పేరుతో ఇజ్రాయెల్ జరిపిన ఈ దాడి ఇటీవల కాలంలో ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌పై జరిగిన అతిపెద్ద దాడిగా గుర్తించారు.
Israel Attack on Iran
ఇరాన్ (Iran) బలగాలు, మిలటరీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వరుస దాడులు జరిపింది. టెహ్రాన్‌లోని నాటాన్స్ యురేనియం ఎన్‌రిచ్‌మెంట్ కేంద్రంతోపాటు పలు మిలటరీ స్థావరాలపై ఈ దాడులు జరిగాయి. ఈ దాడులను ఇజ్రాయెల్ ప్రభుత్వం సమర్ధించుకుంది. ఇరాన్ అణ్వస్త్రాలను సేకరించకుండా నిరోధించేందుకే ముందస్తు చర్యగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది.
ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మరణించిన ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్టుల్లో ఫోరోదూన్ అబ్బాసీ.. ఇరాన్ ఆటమిక్ ఎనర్జీ ఆర్గనేజేష్ మాజీ అధిపతిగా ఉన్నారు. అలాగే పార్లమెంటు సభ్యుడు కూడా. మహమ్మద్ మెహదీ టెహ్రాంచి అనే సైంటిస్ట్ సైద్ధాంతిక భౌతక శాస్త్రవేత్త. షషీద్ బేహిస్థీ యూనివర్శిటీ కులపతిగా పనిచేశారు. అబ్దుల్ హమీద్ జోల్ఫఘరి అనే శాస్త్రవేత్త న్యూక్లియర్ సైంటిస్ట్‌గా ఉన్నారు. సయూ సైయద్ ఫఖి న్యూక్లియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. మరో న్యూక్లియర్ శాస్త్రవేత్త మత్లాబి జడే. వీరంతా ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం, బాలిస్టిక్ మిసైల్ కార్యకలాపాల్లో ప్రమేయం ఉన్నట్టుగా యూఎన్ భద్రతా మండలి తీర్మాన జాబితాలో ఉంది.
Also Read : Hero Dhanush-Kubera : కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 15 కు మార్చిన నిర్మాత















