BC Reservation : హైదరాబాద్ – తమకు న్యాయ పరంగా రావాల్సిన హక్కులు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ బీసీ – ఏ కులాల హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రతినిధులు హైదరాబాద్ (Hyderabad) లోని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ను కలిశారు. ఈ సందర్బంగా వినతిపత్రం సమర్పించారు. బీసీలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కమిషన్ చైర్మన్ తో పాటు బీసీ కమిషన్ సభ్యులు సురేందర్ , జై ప్రకాశ్ ను కమిటీ సభ్యులు కలిసి చర్చించారు.
BC Reservation Updates
రాష్ట్రంలో బీసీ వర్గాలకు న్యాయమైన 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, అలాగే 27 కులాలకు సంబంధించిన హక్కుల అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని విన్నవించారు. మా కోటా మా వాటా అన్నది అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. గత కొన్నేళ్లుగా బీసీలు ,ఇతర నిమ్న వర్గాలు ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయని వాపోయారు. ఇప్పటి వరకు జనాభా దామాషా ప్రకారం సీట్లు రావాల్సి ఉండగా ఏ సర్కార్ చర్యలు తీసుకున్న పాపాన పోలేదన్నారు.
బీసీ కమిషన్ ను కలిసిన వారిలో ప్రొఫెసర్ బాగయ్య, అధ్యక్షులు ఎమ్మెస్ నరహరి, గంగపుత్ర సంఘం అధ్యక్షులు గడప శ్రీహరి, బీసీ – ఎ కులాల అధికార ప్రతినిధి కంటే రామచందర్, కార్యదర్శి అంబటి సుధాకర్ గంగపుత్ర, బీజెపి నాయకురాలు వాణి, తెలంగాణ ప్రాంతీయ ఉద్యమ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గుండా యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.
Also Read : ED Raids Shocking Rainds on Changur Baba : యూపీలో చంగూర్ బాబా ఆస్తులపై ఈడీ దాడులు
















