Rahul Gandhi Shocking Comments : హ‌ర్యానాలో 25 ల‌క్ష‌ల మంది న‌కిలీ ఓట‌ర్లు

బాంబు పేల్చిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ

Hello Telugu - Rahul Gandhi Shocking Comments

Hello Telugu - Rahul Gandhi Shocking Comments

Rahul Gandhi : ఢిల్లీ : ఏఐసీసీ మాజీ చీఫ్‌, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని, కేంద్రంలో మోదీ స‌ర్కార్ పై తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. మొన్న‌టికి మొన్న క‌ర్ణాట‌క‌లో, నిన్న బీహార్ లో దొంగ ఓట‌ర్లు న‌మోదు చేశార‌ని ఆరోపించిన ఎంపీ ఇప్పుడు బాంబు పేల్చారు ఈసీపై. ఏకంగా హ‌ర్యానా రాష్ట్రంలో 25 లక్ష‌ల‌కు పైగా న‌కిలీ ఓట‌ర్లు ఉన్నారంటూ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు త‌మ వ‌ద్ద ఉన్నాయ‌ని ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే ఈసీ త‌న‌పై క‌న్నెర్ర చేసినా ఆయ‌న ఊరుకోవ‌డం లేదు. తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు రాహుల్ గాంధీ. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

Rahul Gandhi Shocking Comments

ఈ న‌కిలీ ఓట‌ర్ల ద్వారా హ‌ర్యానాలో ఈసీ ప‌రోక్షంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ అభ్య‌ర్థులు గెలుపొందేందుకు దోహ‌దం చేసింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ దేశంలో ప్ర‌జాస్వామ్యం అనేది ఉందా అన్న అనుమానం క‌లుగుతోంద‌న్నారు రాహుల్ గాంధీ. గ‌త సంవ‌త్స‌రంలో జ‌రిగిన శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో న‌కిలీ ఓట‌ర్లు పాల్గొన్నార‌ని, వారంతా గంపగుత్త‌గా బీజేపీకి ఓటు వేశార‌ని, త‌మ రుణం తీర్చుకున్నారంటూ మండిప‌డ్డారు. అంతేకాకుండా ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ల‌పై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. క‌మ‌లాన్ని గెలిపించేందుకు ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్, ఇద్ద‌రు క‌మిష‌న‌ర్లు కుమ్మ‌క్క‌య్యారంటూ ఆరోపించారు. హ‌ర్యానాలో కాంగ్రెస్ అఖండ విజ‌యాన్ని ఓట‌మిగా మార్చేశారంటూ ఫైర్ అయ్యారు.

Also Read : Hyderabad-Vijayawada Highway Approved : హైద‌రాబాద్ బెజ‌వాడ హైవే విస్త‌ర‌ణ‌కు లైన్ క్లియ‌ర్

Exit mobile version