PVR Inox : ముంబై – పీవీఆర్ ఐనాక్స్ కీలక ప్రకటన చేసింది. సినిమాలు ప్రదర్శించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. వచ్చే 2027 నాటికి అదనంగా ఇప్పటికి ఉన్న వాటితో కలుపుకుని కొత్తగా 200 కొత్తగా స్క్రీన్లను జోడించనున్నట్లు వెల్లడించింది. దీంతో స్క్రీన్లు గనుక ఏర్పాటైతే మొత్తం 2,000 స్క్రీన్ల మైలు రాయికి చేరుకుంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో తెలంగాణలో 22 కొత్త స్క్రీన్లను ఏర్పాటు చేయనుంది.
PVR Inox Updates
ఇండియాలోనే అతి పెద్ద మల్టీ ప్లెక్స్ చైన్ గా పేరు పొందింది పీఆర్ ఐనాక్స్. ఇందు కోసం ఏకంగా రూ. 400 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నట్లు వెల్లడించింది. ఈసారి దక్షిణాదిపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్లు తెలిపింది. టైర్ -2, టైర్ -3 పట్టణాల్లో విస్తరించాలని యోచిస్తోంది. చిట్ చాట్ సందర్బంగా పీవీఆర్ ఐనాక్స్ (PVR Inox) సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ బిజ్లీ తన వ్యాపార విస్తరణపై వివరాలు తెలియ చేశారు.
ఈ ఏడాది ఏప్రిల్, జూన్ మధ్య 20 కొత్త స్క్రీన్లు జోడించామని చెప్పారు. వచ్చే 2026 ఆర్థిక సంవత్సరంలో 100 స్క్రీన్లు ఏర్పాటు చేస్తామని, వీటిలో 40 శాతంకు పైగా దక్షిణాది ప్రాంతాలలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు బిజ్లి. ప్రధానంగా వీటిని హైదరాబాద్, హుబ్లీ, బెంగళూరులో ఉంటాయన్నారు. మిగతావి ముంబై , ఢిల్లీ, గురు గ్రామ్ , జబల్పూర్, సిలిగురి, గ్యాంగ్ టక్, లేహ్ వంటి నగరాలలో ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 114 స్క్రీన్లను నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్బంగా మరో కీలక సమాచారం పంచుకున్నారు. కేవలం ఒక్క దక్షిణ భారత దేశం నుంచే తమకు ఆదాయ పరంగా 40 శాతానికి పైగా వస్తోందని చెప్పారు బిజ్లి.
Also Read : Popular ICC Test Rankings : బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో జో రూట్ నెంబర్ వన్


















