MD Sajjanar : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ ) అరుదైన ఘనత సాధించింది. సీఎం ఎ. రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం మహిళలు, యువతులు, బాలికలు, వృద్దులకు సంబంధించి ఉచితంగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేసేలా పథకాన్ని తీసుకు వచ్చింది. తమకు చెందిన ఏదైనా గుర్తింపు కార్డు చూపిస్తే చాలు బస్సులలో ప్రయాణం చేసేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఇందులో ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు లేదా పాన్ కార్డ్, పాస్ పోర్టు ఉంటే చాలని స్పష్టం చేసింది.
TGSRTC MD Sajjanar Key Announcement
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారారు మహిళలు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ప్రయాణం చేస్తూనే ఉన్నారు బస్సులలో. దీంతో బస్సులన్నీ కిట కిట లాడుతున్నాయి. అయితే వారు చేసిన ప్రతి జర్నీకి సంబంధించి జీరో టికెట్ జారీ చేస్తారు. ఆ టికెట్ల ఆధారంగా టీజీఎస్ఆర్టీసీ ప్రతి నెలా రాష్ట్ర సర్కార్ కు నివేదిక అందజేస్తుంది. దీని ద్వారా ప్రభుత్వం డబ్బులను ఆర్టీసికి అందజేస్తూ వస్తోంది.
ఇదిలా ఉండగా తాజాగా అరుదైన రికార్డ్ నమోదు చేసింది టీజీఎస్ఆర్టీసీ. ఈ విషయాన్ని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ (MD Sajjanar) వెల్లడించారు. తెలంగాణ ఆర్టీసీ మరో మైలురాయిని దాటింది. ఇప్పటి వరకు 200 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం చేశారని వెల్లడించారు ఎండీ . మహిళలు ఉచిత ప్రయాణ విలువ రూ.6700 కోట్లు అని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు ఆర్టీసీకి నిధులు విడుదల చేస్తోంది సర్కార్. రేపు రాష్ట్ర వ్యాప్తంగా 97 ఆర్టీసీ డిపోల్లో 341 బస్ స్టేషన్ లలో సంబరాలు జరగనున్నాయని తెలిపారు ఎండీ. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్.
Also Read : CJI Justice Gavai Shocking Comments : ఈడీ తీరుపై సీజేఐ జస్టిస్ గవావ్ షాకింగ్ కామెంట్స్
















