Pharma Gas Leak : పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఎస్‌ఎస్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జరిగిన ఈ ప్రమాదంలో గ్యాస్ లీక్ కారణంగా ముగ్గురు కార్మికులు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వీరిలో పరిమి చంద్రశేఖర్ (సేఫ్టీ మేనేజర్ – తెలంగాణ) మరియు సరగడం కుమార్ (సేఫ్టీ ఆఫీసర్ – మునగపాక, అనకాపల్లి) మృతి చెందగా, బైడూ భైసాల్ (హెల్పర్ – బోడెన్, ఒడిశా) అనే కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Pharma Gas Leak in Parawada
ఈ ఘటన అనకాపల్లి జిల్లా పరిధిలోని పరవాడ ఫార్మాసిటీలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఎస్ (సాయి శ్రేయస్) ఫార్మా కంపెనీలోని రసాయన వ్యర్థాల శుద్ధి ప్లాంట్ వద్ద స్థాయిలను తనిఖీ చేయడానికి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కార్మికులు ప్రమాదవశాత్తూ విడుదలైన విషవాయువులను పీల్చడం వల్ల అస్వస్థతకు లోనయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే పరవాడ సీఐ మల్లికార్జునరావు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read : War 2 Movie : వార్ 2 సినిమాకు డబ్బింగ్ షురూ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్
















