Shobha Karandlaje : ఢిల్లీ – కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే కీలక ప్రకటన చేశారు. ఎంఎస్ఎంఈల ద్వారా 1.5 కోట్ల జాబ్స్ క్రియేట్ చేయడం జరిగిందన్నారు. ఈ సంఖ్య ఒక్క తెలంగాణలో సాధ్యమైందని చెప్పారు. సూక్ష్మ, చిన్న , మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) అభివృద్ధికి కేంద్రం అనుసరిస్తున్న విధానాల కారణంగా భారతదేశంలో ఉపాధి అవకాశాలు వేగంగా పెరిగాయని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే (Shobha Karandlaje) చెప్పారు. ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ప్రకారం, జూలై 1, 2020 నుండి జూలై 31, 2025 వరకు, తెలంగాణలో మొత్తం 1.59 కోట్ల మంది ఉద్యమం రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో నమోదైన సంస్థల ద్వారా ఉపాధి పొందారని వెల్లడించారు.
Shobha Karandlaje Key Comments
లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ కుందూరు రఘురామ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నకు మంత్రి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. గత ఐదు సంవత్సరాలలో నల్గొండ జిల్లాలో 5.92 లక్షల మంది, సూర్యాపేట జిల్లాలో 5.44 లక్షల మంది ఉద్యోగాలు పొందారని పేర్కొన్నారు. వెనుకబడిన జిల్లాల్లో వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి కేంద్రం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోందని శోబా తెలిపారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (PMEGP) కింద పశుసంవర్ధకం, పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం, ఆక్వాకల్చర్, తేనె ఉత్పత్తి వంటి సాంప్రదాయ రంగాలను కూడా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.
ఈ అవకాశాల గురించి సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి అన్ని రాష్ట్రాలలో, ముఖ్యంగా అభివృద్ధి చెందని ప్రాంతాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
Also Read : AP BJP Chief Madhav Alarming : ఆక్వా రైతులను ఆదుకోవాలి – మాధవ్


















