స‌మంత ‘మా ఇంటి బంగారం’ హిందీలో

అద్భుత విజ‌యాన్ని నమోదు చేసిన మూవీ

hellotellugu-MaaIntiBangaram

హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ద‌ర్శ‌కురాలిగా గుర్తింపు పొందారు నందిని రెడ్డి. త‌ను తీసిన తాజా చిత్రం మా ఇంటి బంగారం. ఇందులో ముఖ్య పాత్ర పోషించారు ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ స‌మంత రుత్ ప్ర‌భు. తెలుగులో విడుద‌లైన ఈ చిత్రం ఎవ‌రూ ఊహించ‌ని విధంగా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. స‌మంత అద్భుత‌మైన న‌ట‌న‌కు జ‌నం ఫిదా అయ్యారు. ఇంటిల్లిపాది చూసేలా దీనిని చిత్రీక‌రించ‌డంలో స‌క్సెస్ అయ్యారు నందిని రెడ్డి. తాజాగా మా ఇంటి బంగారం కు సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. సమంత రూత్ ప్రభు నటించిన ‘మా ఇంటి బంగారం’ ఇప్పుడు సోనీ లివ్ లో హిందీలో అందుబాటులో ఉంది. ప్రధాన పాత్రలో నటించిన ఈ యాక్షన్-ప్యాక్డ్ డ్రామా చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడమే కాకుండా, ప్రేక్షకుల నుండి ప్రశంసలను కూడా అందుకుంటోంది.

కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలు, దాగి ఉన్న రహస్యాల కలయికగా సాగే ఈ చిత్రం ఒక సున్నితమైన ఇంటి రాక ఊహించని మలుపు తిరగడం చుట్టూ అల్లుకుని ఉంటుంది. ఈ చిత్రం అభిమానులను అలరిస్తూనే ఉండగా, సమంత రూత్ ప్రభు దీనికి సంబంధించిన తన అనుభవాలను పంచుకున్నారు. చిత్రం , షూటింగ్ గురించి మాట్లాడుతూ సమంత ఇలా అన్నారు.. మా ఇంటి బంగారం’ నాకు కేవలం మరో సినిమా మాత్రమే కాదు. తాము ఒక సరదా , ఆహ్లాదకరమైన చిత్రాన్ని రూపొందించాలని అనుకున్నామని పేర్కొన్నారు. దానిని చేస్తున్నప్పుడు తాము పొందిన ఆనందం నా మనసులో అలాగే నిలిచి పోయిందన్నారు. ఇది హృదయానికి హత్తుకునే , ఆస్వాదించడానికి సులభమైన కథ. ఇది ఇప్పుడు సోనీ లివ్‌లో హిందీలో అందుబాటులోకి రావడం నాకు సంతోషంగా ఉంద‌న్నారు స‌మంత‌.

Exit mobile version