శ్రీ‌రామ న‌వ‌మి శోభా యాత్ర‌కు ప‌టిష్ట బందోబ‌స్తు

ట్రాఫిక్ రూల్స్ పాటించాల‌న్న సీపీ వీసీ స‌జ్జ‌నార్

hellotelugu-VCSajjnaar

హైదరాబాద్ : శ్రీ‌రామ న‌వ‌మి పండుగ సంద‌ర్బంగా ఇవాళ హైద‌రాబాద్ న‌గ‌రంలో భారీ ఎత్తున శ్రీ‌రామ న‌వమి శోభాయాత్ర జ‌ర‌గ‌నుంది. ఇందులో భాగంగా ప‌టిష్ట‌మైన ఏర్పాట్లు చేసిన‌ట్లు తెలిపారు సీపీ వీసీ స‌జ్జ‌నార్. ఉదయం 9:00 గంటల నుండి రాత్రి 9:00 గంటల వరకు జరగనుంది. ఈ యాత్ర సీతారాంబాగ్ ఆలయం నుండి ప్రారంభమై భోయిగూడ కమాన్, మంగళ్‌హాట్, ధూల్‌పేట్, పురానాపూల్, గాంధీ విగ్రహం, జుమ్మరత్ బజార్, బేగం బజార్, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, పుత్లిబౌలి, కోటి, సుల్తాన్ బజార్ వంటి కీలక మార్గాల గుండా హనుమాన్ వ్యాయామశాల పాఠశాల, సుల్తాన్ బజార్ వైపు సాగుతుంది. ఊరేగింపు మార్గంలోని పలు కూడళ్ల వద్ద ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయబడతాయి.

రాకపోకలు క్రమపద్ధతిలో నియంత్రించబడతాయి మరియు ఊరేగింపు వెళ్ళిపోయిన తర్వాత ప్రతి కూడలి వద్ద ట్రాఫిక్ పునరుద్ధరించబడుతుంది. మల్లేపల్లి ఎక్స్ రోడ్స్, అఘపురా ఎక్స్ రోడ్స్ , భోయిగూడ కమాన్ , గాంధీ విగ్ర‌హం, ట‌క్క‌ర్ వాడి జంక్ష‌న్ , బేగంగ‌బ‌జార్ ఛ‌త్రి, అఫ్జల్‌గంజ్ టి-జంక్షన్, మొజంజాహి మార్కెట్, పుత్లిబౌలి క్రాస్ రోడ్ , కోటి ఆంధ్రా బ్యాంక్ ఎక్స్ రోడ్ , చాదర్‌ఘాట్‌, కాచిగూడ జంక్షన్‌లు ర‌ద్దీగా ఉంటాయ‌ని తెలిపారు సీపీ. ప్ర‌యాణీకుల‌కు కీల‌క సూచ‌న‌లు చేశారు. మీ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాల‌ని, రద్దీ సమయాల్లో ఊరేగింపు మార్గాలకు దూరంగా ఉండాల‌ని సూచించారు.

Exit mobile version