Youtuber TTF Vasan : యూట్యూబ‌ర్ వాస‌న్ అరెస్ట్

నిర్ల‌క్ష్యంగా డ్రైవింగ్ తో వీడియోస్

త‌మిళ‌నాడు – ప్ర‌ముఖ యూట్యూబ‌ర్ టీటీఎఫ్ వాస‌న్ అరెస్ట్ అయ్యాడు. బైక్ ల‌తో విన్యాసాలు చేయ‌డం, వాటిని యూట్యూబ్ లో అప్ లోడ్ చేయ‌డంతో పాపుల‌ర్ అయ్యాడు వాస‌న్. తాజాగా ట్రాఫిక్ రూల్స్ కు విరుద్దంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో పోలీసులు సీరియ‌స్ అయ్యారు. ఈ మేర‌కు అదుపు లోకి తీసుకునే ప్ర‌య‌త్నం చేశారు.

ఇదిలా ఉండ‌గా టీటీఎఫ్ వాస‌న్ బెంగ‌ళూరు నుండి పారి పోయేందుకు ప్ర‌య‌త్నించడంతో ప‌ట్టుకున్నారు. దాడి చేసిన ఘ‌ట‌న‌కు సంబంధించి సూలూరు వ‌ద్ద యూట్యూబ‌ర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆ త‌ర్వాత బెయిల్ పై విడుద‌ల చేశారు. ఈ ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది.

ఈ మ‌ధ్య‌న ప్ర‌తి ఒక్క‌రు సెల‌బ్రెటీలు కావాల‌ని, త‌క్కువ స‌మ‌యంలో పాపుల‌ర్ అయి పోవాల‌ని త‌ల తిక్క ప‌నులు చేస్తున్నారు. అడ్డంగా బుక్క‌వుతున్నారు. ఇందుకు తాజా ఉదాహ‌ర‌ణే యూట్యూబ‌ర్ టీటీఎఫ్ వాస‌న్ వ్య‌వ‌హారం.

వాస‌న్ స్వ‌స్థ‌లం కోయంబ‌త్తూర్ లోని మెట్టుపాళ‌యం. ట్విన్ థ్రాట్ల‌ర్స్ పేరుతో యూట్యూబ్ ఛాన‌ల్ న‌డుపుతున్నాడు. ఖ‌రీదైన బైక్ ల‌పై సాహ‌సాలు చేయ‌డం, వాటిని వీడియోలు తీసి అప్ లోడ్ చేస్తుండ‌డంతో పాపుల‌ర్ అయ్యాడు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com