Harsha Sai : యూట్యూబర్ హర్ష సాయి కేసులో వెలుగులోకి కీలక అంశాలు

ఈ క్ర‌మంలో.. నిన్న యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు అయ్యింది...

Hello Telugu - Harsha Sai

Harsha Sai : ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి కేసులో కీలక ట్విస్ట్ బయట పడింది. ఈమ‌ధ్య‌ హ‌ర్ష హీరోగా రూపొందిన‌ ‘మెగా’ సినిమాకు సంబంధించిన కాపీ రైట్స్ కోసం హర్ష సాయి తెగింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు బాధితురాలు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించగా.. కాపీ రైట్స్ విషయంపై ఇద్దరి మధ్య వివాదం నెలకొన్నట్లు సమాచారం. ఈ క్రమంలో బాధితురాలికి మత్తు మందు ఇచ్చి హర్ష సాయి అఘాయిత్యానికి పాల్పడిన‌ట్లు, బాధితురాలి వీడియోలు హర్ష సాయి సీక్రెట్‌గా రికార్డు చేసినట్లు తెలిసింది. సినిమా కాపీ రైట్స్ ఇవ్వకుంటే వీడియోలు బయట పెడతానని హర్ష సాయి(Harsha Sai) బ్లాక్ మెయిల్‌కు పాల్పడినట్లు సమాచారం.

Harsha Sai Case..

ఈ క్ర‌మంలో.. నిన్న యూట్యూబర్ హర్షసాయి(Harsha Sai)పై కేసు నమోదు అయ్యింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి హర్ష మోసం చేశాడంటూ సదరు యువతి అడ్వకేట్‌తో కలిసి నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి మరీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు యూట్యూబర్‌పై కేసు నమోదు చేశారు. బాధితురాలి నుంచి నార్సింగ్ పోలీసులు కొన్ని ఆధారాలను సేకరించారు. మరికొన్ని ఆధారాలను సమర్పించాలని బాధితురాలిని పోలీసులు కోరారు. హర్ష సాయి నుంచి అతని ఫాలోవర్స్ నుంచి ప్రాణహాని ఉందంటూ బాధితురాలు పోలీసులకు చెప్పింది.

పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన వద్ద నుంచి రూ. 2 కోట్లు తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. ప్రేమ, పెళ్లి పేరుతో లొంగదీసుకుని నగ్న వీడియోలను, నగ్న చిత్రాలను పెట్టుకుని బ్లాక్మెయిల్ చేశారని.. పలుమార్లు తనపైన అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. అలాగే దాడి కూడా చేశాడని బాధితురాలు వాపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు హర్ష సాయి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. యూట్యూబర్‌పై 328, 376(2)(n)354(B)(C) సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. హర్ష సాయితో పాటు ఆయన తండ్రి రాధాకృష్ణపై కూడా కేసు నమోదు చేశారు. అయితే హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ కూడా నిన్నటి నుంచి అందుబాటులో లేకుండా పోయారు. వీరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read : Mohan Babu : నటుడు మోహన్ బాబు ఇంట్లో భారీ చోరీ…పట్టుబడ్డ దొంగ

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com