Naveen Polishetty : ప్రమాదానికి గురైన యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి

నేను పూర్తిగా రికవర్ అయ్యాక వాటి షూటింగ్ మొదలుపెడతాను...

Hello Telugu - Naveen Polishetty

Naveen Polishetty : యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ప్రమాదానికి గురయ్యాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty). తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను మెప్పించాడు. ఆతర్వాత వచ్చిన జాతిరత్నాలు సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాతో ఓవర్ నైట్ లో నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) పేరు మారుమ్రోగింది. అలాగే స్టార్ హీరోయిన్ అనుష్కతో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా చేశాడు. ఈ సినిమా వచ్చి చాలా రోజులు అవుతున్నా ఇంతవరకు నవీన్ న్యూ మూవీ పై అప్డేట్ లేదు. దాంతో రకరకాల రూమర్స్ వచ్చాయి. తాజాగా దీని పై నవీన్ క్లారిటీ ఇచ్చాడు. ఈమేరకు ఆయన ఓ సుదీర్ఘ లేక రాశారు.

Naveen Polishetty Comment

“ఈ రోజు మీతో నేనొక పర్సనల్ విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దురదృష్టవశాత్తూ, నాకు చేతి బోన్ కి తీవ్రమైన మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి, కాలికి కూడా ఇంజరీ అయ్యింది. ఇది నాకు చాలా టఫ్ అండ్ పెయిన్ ఫుల్ టైమ్. ముఖ్యంగా క్రియేటివ్ యాంగిల్ లో. ఈ ఇంజరీ వల్ల నేను ఫాస్ట్ గా మీ ముందుకు నా ఫిలిమ్స్ తీసుకురాలేకపోతున్నందుకు సారీ. గత కొన్ని రోజులు చాలా టఫ్ గా గడిచాయి. నేను కంప్లీట్ గా రికవర్ అయ్యి. మీకు నా బెస్ట్ ఎనర్జిటిక్ వెర్షన్ ని చూపించడానికి మెడికల్ ప్రొఫెషనల్స్ సహాయంతో వర్క్ చేస్తున్నాను. కానీ దానికి కొన్ని నెలలు టైమ్ పడుతుంది. నేను ముందు కంటే స్ట్రాంగ్ గా, హెల్తీ గా కమ్ బ్యాక్ అవ్వాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాను.

గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు డెవలప్మెంట్ లో ఉన్న నా అప్ కమింగ్ ఫిలిమ్ స్కిప్ట్ అధ్భుతంగా, మీకు బాగా నచ్చే విధంగా రూపు దిద్దుకుంటున్నాయి. నేను పూర్తిగా రికవర్ అయ్యాక వాటి షూటింగ్ మొదలుపెడతాను. మీ లవ్ అండ్ ఎంకరేజ్మెంట్ యే నాకు అన్నీ. నేను తిరిగి మీ ముందుకు రావాలను ఆకకి అనే మోటివేషన్. మీ సపార్ట్ కీ, పేషన్స్ కి చాలా థాంక్స్. అతి త్వరలో నేను మళ్ళీ స్క్రీన్ మీద కనిపించి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. బెస్ట్ ఎనర్జిటిక్ వెర్షన్ ని చూపించడానికి మెడికల్ ప్రొఫెషనల్స్ చేస్తున్నాను.

కానీ దానికి కొన్ని నెలలు టైమ్ పడుతుంది. నేన గా, హెల్దీ గా కమ్ బ్యాక్ అవ్వాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాను. గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు డెవలప్మెంట్ లో ఉన్న నా రూపు దిద్ద స్క్రిప్ట్ అద్భుతంగా, మీకు బాగా నచ్చే విధంగా పూర్తిగా రికవర్ అయ్యాక వాటి షూటింగ్ మొదలుపెడతా, మీ లవ్ అండ్ ఎంకరేజ్మెంట్ యే నాకు అన్నీ నేను తిరిగి మీ ముందుకు రావాలన్న ఆశకి అవే మోటివేషన్. మీ సపోర్ట్ కీ, పేషన్స్ కీ చాలా థాంక్స్ అతి త్వరలో నేను మళ్ళీ స్క్రీన్ మీద కనిపించి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. మీరు ఎప్పటిలాగే నా మీద మీ ప్రేమని కురిపించడానికి సిద్ధంగా అనుకుంటున్నాను..మీ జానేజిగర్. అంటూ రాసుకొచ్చారు నవీన్.

Also Read : Music Shop Murthy OTT : ఓటీటీలో చాందిని చౌదరి నటించిన ‘మ్యూజిక్ షాప్ మూర్తి’

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com