Yogi Babu : ఇదిలాఉంటే గతంలో వడివేలుతో 23వ పులకేశి, దళపతి విజయ్‌తో పులి వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన శింబు దేవన్ కాస్త విరామం తర్వాత దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం ‘బోట్’ . ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీలో యోగిబాబు(Yogi Babu), గౌరి కిషన్, చిన్ని జయంత్, కులప్పులి లీలా, ఎంఎస్ భాస్కర్, శామ్స్, మధుమిత, షారా, మాస్టర్ ఆకాష్ దాస్‌తో పాటు హాలీవుడ్ నటుడు జెస్సీ ఫోక్స్-ఆలెన్ తదితరులు నటించారు. మాదేష్ మాణిక్యం ఛాయాగ్రహణం అందించగా, జిబ్రాన్ సంగీతం సమకూర్చారు. నడి సముద్రంలో జరిగే ఈ చిత్రాన్ని మాలి అండ్ మాన్వి మూవీ మేకర్స్, శింబు దేవన్ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై ప్రేమ్ కుమార్, ప్రభా ప్రేమ్ కుమార్, సి కలైవాణి సంయుక్తంగా నిర్మించారు.
Yogi Babu Comment
అయితే.. తాజాగా ఈ ‘బోట్’ చిత్రం ఆడియో రిలీజ్ వేడుక తాజాగా చెన్నైలో జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ హాస్య నటుడు యోగిబాబు(Yogi Babu) చాలా ఆలస్యంగా వచ్చారు. ఆయన వచ్చే సమయానికి ఆడియో రిలీజ్ వేడుక మొత్తం ముగిసిపోయింది. దీంతో ఆయన మీడియాకు, ప్రేక్షకులకు , తన అభిమానులకు అందరి ముందు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఓ సినిమా షూటింగ్ లొకేషన్ నుంచి ఇక్కడకు రావడం ఆలస్యమైందని అందుకు క్షమించాలని కోరారు. భవిష్యత్‌లో మరోసారి ఇలా జరుగకుండా చేసుకుంటానని తెలిపారు. ఆడియో, ట్రైలర్ రిలీజ్ వేడుకలో దర్శకుడు శింబుదేవన్ మాట్లాడుతూ, ‘ఇప్పటివరకు తాను దర్శకత్వం వహించిన చిత్రా ల్లో ఫాంటసీ, కామెడీ వంటి అంశాలే ఉన్నాయి. ఈ సినిమాలో ఈ రెండు అంశాలున్నాయి. ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన నిర్మాత ప్రేమ్ కమార్‌కు ధన్యవాదాలు. ఈ సినిమా ద్వారా నేను కూడా నిర్మాతగా మారాను. కథ చెప్పగానే ప్రేమ్ కుమార్ నాపై నమ్మకంతో ప్రాజెక్టు అప్పగించారు. ఇందులో హీరోగా యోగిబాబు, జాలరి పాత్ర పోషించగా హీరోయిన్ గౌరి కిషన్, పాత్ర భావోద్వేగంతో కూడుకుని ఉంటుంది.
ఈ సినిమాకు సంగీతం, ఛాయాగ్రహణం ఎంతో ముఖ్యం. ఎందుకంటే సముద్రం గురించి నాకు ఏమీ తెలియదు. ప్రతి ఒక్కరిలాగే తీరం ఒడ్డున నిలబడి ఆలల శబ్దాన్ని అలలను నిశితంగా చూస్తుంటాను. పైగా సముద్రంలో షూటింగ్ అంటే ఆషామాషీ కాదు. కొన్ని సమయాల్లో ఉగ్రరూపంలో, మరికొన్ని సందర్భాల్లో ప్రశాంతంగా ఉంటుంది. ఇలాంటి షూటింగ్‌లో సినిమా తీసే ప్రతి ఒక్కరూ ఎంతో శ్రమించాల్సిందే’ అని పేర్కొన్నారు. అలాగే, నిర్మాతలు, ఇతర నటీనటులు ప్రసంగించారు.
Also Read : Game Changer : గేమ్ చేంజర్ నుంచి కియారా బర్త్ డే సందర్బంగా కీలక అప్డేట్