Yatra2 Movie : దేశ రాజకీయాలలో ఏపీకి ఓ చరిత్ర ఉంది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో సీఎంగా పని చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రస్థానం విస్మరించ లేనిది. ఎన్ని పనులున్నా సరే తన కోసం వచ్చే ప్రజల కోసం వేచి ఉండే వారు. వారు ఇచ్చిన వినతి పత్రాలను స్వీకరించే వారు. అక్కడికక్కడే పనులు అయి పోయేవి.
Yatra2 Movie Updates
ఆయన ప్రవేశ పెట్టిన ఆరోగ్య శ్రీ చాలా మందికి వెలుగులు పంచింది. ఆరోగ్య పరంగా ఆదుకుంది. ఆ తర్వాత ఆయన అనూహ్యంగా మరణించడంతో చోటు చేసుకున్న పరిణామాలు కొంత విభ్రాంతిని కలిగించేలా చేశాయి. తండ్రి చావును అడ్డం పెట్టుకుని ఏపీకి సీఎం కావాలని ప్రస్తుత ఏపీ సీఎం జగన్ రెడ్డి ప్రయత్నం చేశాడనే ఆరోపణలు లేక పోలేదు.
ఇదంతా పక్కన పెడితే ఆనాటి కాంగ్రెస్, సంకీర్ణ సర్కార్ పనిగట్టుకుని జగన్ రెడ్డిని ఇరికించింది. ఆయన 17 నెలల పాటు జైలులో ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఏపీ విడిపోయిన తర్వాత తనే ఒంటరి పోరాటం చేశాడు. చివరకు ఊహించని మెజారిటీతో కొలువు తీరాడు. ప్రస్తుతం సీఎంగా పని చేస్తున్నారు.
ఇదిలా ఉండగా మహి రాఘవ్ దర్శకత్వంలో వైఎస్సర్ జీవిత చరిత్ర ఆధారంగా యాత్ర(Yatra) తీశాడు. అది భారీగానే ఆకట్టుకుంది. తాజాగా యాత్రకు సీక్వెల్ గా యాత్ర2 తీశాడు. ఇందుకు సంబంధించిన పోస్టర్స్ హల్ చల్ చేస్తున్నాయి. జగన్ జైలు పాలు కావడానికి సోనియానే కారణమని ఇప్పటికీ విమర్శలు ఉన్నాయి. ఈ చిత్రంలో సోనియా పాత్ర కూడా ఉండడం విశేషం.
Also Read : Jonitha Gandhi : జోరు మీదున్న జోనితా గాంధీ