Yatra 2: వచ్చేస్తోంది ‘యాత్ర 2’ టీజర్‌ !

వచ్చేస్తోంది ‘యాత్ర 2’ టీజర్‌ !

Hello Telugu - Yatra 2

Yatra 2: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఇతివృత్తంగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో మహి వి. రాఘవ్‌ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ‘యాత్ర’. 2019 ఎన్నికలకు ముందు విడుదలైన ఈ సినిమా… ఘన విజయం సాధించడంతో పాటు ఆ ఎన్నికల్లో వైసిపి విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. దీనితో ‘యాత్ర’ సినిమాకు సీక్వెల్‌గా ‘యాత్ర 2’ ను దర్శకుడు మహి వి. రాఘవ్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర రెడ్డి పాత్రలో మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి నటించగా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి(AP CM YS Jagan) పాత్రలో హీరో జీవా నటిస్తున్నారు. వైఎస్సార్‌ తనయుడుగా, ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసి 2019 ఎన్నికల్లో 151 ఎమ్మెల్యే సీట్లతో ఘన విజయం సాధించి ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదిగిన తీరుని, 2009 నుంచి 2019 వరకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Yatra 2 Updates

‘యాత్ర’ సినిమా 2019 ఫిబ్రవరి 8న విడుదల కావడంతో… దానికి సీక్వెల్ గా తెరకెక్కించిన ‘యాత్ర 2’ సినిమాను 2024 ఫిబ్రవరి 8న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడడంతో సినిమా యూనిట్ ప్రమోషన్స్‌లో స్పీడ్‌ పెంచింది. ఇప్పటికే హీరో జీవా లుక్‌తో పాటు వైఎస్‌ భారతీ పాత్ర పోషిస్తున్న మరాఠీ నటి కేతకి నారాయణన్‌ లుక్‌ని విడుదల చేసారు. దీనికి మంచి స్పందన రావడంతో జనవరి 5న ‘యాత్ర 2’ టీజర్ ను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు ‘యాత్ర 2’కు సంబంధించి మమ్ముట్టి, జీవాలకు సంబంధించిన కొత్త పోస్టర్‌ని కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Also Read : Samyuktha Menon: పెళ్లి చేసుకోబోతున్న ‘భీమ్లా నాయక్’ బ్యూటీ ?

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com