సినీ రంగంలో బయో పిక్ లు ఈ మధ్యన ఎక్కువగా వస్తున్నాయి. ఇటీవలే ప్రముఖ శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్ర ఆధారంగా తమిళ సినీ నటుడు విజయ్ సేతుపతి నటించాడు. ఆ చిత్రం కూడా రిలీజ్ అయ్యింది. మంచి టాక్ తెచ్చుకుంది.
ఇక ఇరు తెలుగు రాష్ట్రాలలో దివంగత నేత, మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మంచి గుర్తింపు పొంది. పేదల బాంధవుడిగా పేరు పొందారు. అనుకోని ఘటనలో దుర్మరణం పాలయ్యారు.
ప్రస్తుతం ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు. త్వరలో రాష్ట్రానికి సంబంధించి ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే వైఎస్సార్ అభిమానులను దృష్టిలో ఉంచుకుని గతంలో యాత్ర పేరుతో జవిత కథను తెరకెక్కించే ప్రయత్నం చేశారు దర్శకుడు మహి వి. రాఘవ్.
ప్రస్తుతం సదరు బయో పిక్ చిత్రానికి సీక్వెల్ గా యాత్ర 2 పేరుతో సినిమా తీశారు. ఇందులో ఇద్దరు ప్రముఖ నటులు తండ్రీ కొడుకులుగా నటించారు. ఒకరు వైఎస్సార్ పాత్రలో మళయాలం సినీ రంగానికి చెందిన మమ్ముట్టి నటించగా కొడుకు వైఎస్ జగన్ రెడ్డి పాత్రలో తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన జీవా నటిస్తున్నారు.
ఇదిలా ఉండగా యాత్ర 2 ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది సోషల్ మీడియాలో.