Yashraj Mukhate: బాలీవుడ్ సంగీత దర్శకుడు యశ్ రాజ్ ముఖాటే వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. తన స్నేహితురాలు అల్పనాను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలను యశ్ రాజ్ తన ఇన్‌స్టాలో షేర్ చేసారు. దీనితో యశ్ రాజ్ పోస్ట్ పై స్పందిస్తున్న అభిమానులు… నూతన దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రముఖ నటి సుప్రియా పిల్గావ్కర్, కుషా కపిల, తన్మయ్ భట్, జామీ లీవర్ కూడా ఈ కొత్త జంటకు మ్యారేజ్ విషెస్ తెలిపారు. ఇటీవల కాలంలో డెస్టినేషన్ వెడ్డింగ్ కు అలవాటుపడిన సెలబ్రెటీలకు భిన్నంగా యశ్ రాజ్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Yashraj Mukhate Marriage Viral
యశ్ రాజ్(Yashraj Mukhate) తన రసోదే మే కౌన్ థా మాషప్ తర్వాత ప్రసిద్ధి చెందాడు. అప్పటి నుంచి యశ్ రాజ్ వినోదభరితమైన సంగీతం, రీమిక్స్‌లు, వీడియోలను సృష్టిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. అతనికి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ద ఎత్తున ఫాలోవర్స్ కూడా ఉన్నారు. డైలాగ్ లను ఆకట్టుకునే ట్యూన్ లుగా మార్చడంలో అతనిది ప్రత్యేకమైన శైలి. వినోదాత్మక కంటెంట్‌ను రూపొందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. గత రెండేళ్లలో అజయ్ దేవగన్, షెహనాజ్ గిల్ వంటి ప్రముఖులు కూడా యశ్ రాజ్‌తో కలిసి పనిచేశారు.
Also Read : Santhanam: ‘ఇక్కడ నేనే కింగ్’ అంటున్న స్టార్ కమెడియన్ !