Yash : కన్నడ నాట తక్కువ సమయంలోనే సూపర్ స్టార్ హోదా దక్కించుకున్న నటుడు యష్(Yash). ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తను నటించిన కేజీఎఫ్ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఆదరణ చూరగొంది. కోట్లు కొల్లగొట్టింది. ఆ తర్వాత ఆ సినిమా అందించిన ప్రోత్సాహం, ఉత్సాహంతో సీక్వెల్ కూడా తీశారు దర్శకుడు. అది కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఊహించని సక్సెస్ తో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాడు యష్.
Yash Sing
ఏ పాత్ర ఇచ్చినా దానిలో లీనమై పోయే గుణం కలిగిన నటుడు యష్. అందుకే తను దర్శకులకు కావాల్సిన నటుడంటూ కితాబు ఇచ్చాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. తనతో ఎలాగైనా ఎంతటి పాత్రనైనా అవలీలగా చేయించవచ్చని చెప్పాడు ఆ మధ్యన చిట్ చాట్ సందర్బంగా.
తాజాగా ఈ కన్నడ సూపర్ స్టార్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. దీనికి కారణం తను ఇష్టపడే భార్య రాధిక పండిట్ కోసం ఏకంగా ఓ పాట పాడాడు. తను లేక పోతే ఉండలేనంటూ పాట ద్వారా మెస్సేజ్ ఇచ్చాడు. ఇందు కోసం ప్రియ సఖీ జోథెయాలి జోథెయాలి సూపర్ సాంగ్ తో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు సోషల్ మీడియాను యష్ షేక్ చేస్తున్నాడు.
తను ఏది చేసినా అది సెన్సేషన్. ఎందుకంటే తనకు ఎలాంటి భేషజాలు అంటూ ఉండవు. ఓ సాధారణ కండక్టర్ కొడుకు కదా అందుకని, తనకు ప్రదర్శించడం అంటే ఇష్టం ఉండదంటూ ప్రకటించాడు. హ్యాట్సాఫ్ యష్. కీప్ ఇట్ అప్ అంటున్నారు ఫ్యాన్స్.
Also Read : Chhaava Collections Sensational :వసూళ్ల వేటలో ఛావా సెన్సేషన్