Womens Day : మహిళా దినోత్సవం పురస్కరించుకుని హీరోయిన్లు మహిళలందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు లేక పోతే ఈ ప్రపంచం లేదన్నారు. ప్రతి రంగంలో కీలకమైన పాత్రను నిర్వహిస్తూ అందరూ విస్తు పోయేలా తమను తాము ప్రూవ్ చేసుకుంటున్నారని అన్నారు. ఈ సందర్బంగా తమిళ సినీ రంగానికి చెందిన టాప్ హీరోయిన్స్ వైరల్ గా మారారు. ప్రస్తుతం వీరు దిగిన ఫోటోలు, వీడియో హల్ చల్ చేస్తోంది సామాజిక మాధ్యమాలలో.
Womens Day Special Heroines
అమ్మన్ -2 సీక్వెల్ మూవీలో కీలక పాత్ర పోషిస్తోంది లేడీ అమితాబ్ బచ్చన్ గా గుర్తింపు పొందిన నయనతార. తనకు ఇద్దరు కవల పిల్లలు పుట్టినా ఎక్కడా తగ్గడం లేదు. తను ప్రస్తుతం ఇందులో దేవత పాత్ర పోషిస్తోంది. ఈ పాత్ర కోసం తను నెల రోజుల పాటు ఉపవాసం ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు చిత్ర నిర్మాత గణేశ్.
ఇదే క్రమంలో ఓ ఈవెంట్ సందర్బంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు సినీ తారలు ఖుష్బూ(Kushboo), మీనా, నయన తార, రెజీనా కాసాండ్రో. వీరంతా కలిసి గ్రూప్ ఫోటో దిగారు. తాము వివిధ పాత్రల ద్వారా అభిమానం సంపాదించుకున్నారు. అంతే కాదు తమిళ నాట ఎక్కువగా ఫ్యాన్స్ సంపాదించుకున్న వారిలో ఖుష్బూ ఒకరు. తనకు ఏకంగా ఓ గుడి కూడా కట్టేశారు ఫ్యాన్స్.
Also Read : Beauty Priyanka Chopra :రూ. 13 కోట్లకు ప్రియాంక చోప్రా అపార్ట్మెంట్స్ సేల్