Nayanthara : ఇటీవల ప్రముఖ రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సంగీత విద్వాంసులు, సినీ తారల జీవిత చరిత్రల ఆధారంగా బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి. విడుదలైన పలు చిత్రాలు ప్రేక్షకులను మెప్పించాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ సంగీత కళాశాల విద్యార్థిని, గాయని ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవిత చరిత్ర తెరపై దృశ్య కావ్యంలా రూపుదిద్దుకుంటుంది.
Nayanthara Movies
నిజానికి ఈ జీవిత చరిత్ర గురించి కొంతకాలం క్రితం వార్తలు వచ్చాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ కథానాయికగా నటించనుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు ఆ పాత్రలో నయనతార నటిస్తుందని తెలిసింది. ఈ ప్రాజెక్ట్‌ను నిర్వహిస్తున్న బెంగళూరుకు చెందిన ప్రొడక్షన్ హౌస్ ప్రధాన పాత్రల కోసం నయనతార, రష్మిక మందన్న మరియు త్రిష వంటి పేర్లను పరిశీలిస్తోంది. తమిళం, కన్నడ, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రంలో నయనతారకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం.
Also Read : Johnny Wactor : ముగ్గురు దుండగుల చేతిలో హత్యకు గురైన ప్రముఖ హాలీవుడ్ నటుడు