Vishnu Priya : తాము ఏం చేసినా చెల్లిపోతుందనే భ్రమలో ఉన్న టాలీవుడ్ నటీ నటులకు చుక్కలు చూపించారు హైదరాబాద్ పోలీసులు. ప్రధానంగా సీనియర్ కాప్ , ఎండీ వీసీ సజ్జనార్ దెబ్బకు అటు యూట్యూబర్లు ఇటు నటులకు కోలుకోలేని షాక్ తగిలింది. ఆయన గత కొంత కాలంగా బెట్టింగ్ యాప్స్ పై యుద్దం చేస్తున్నారు. వీటిని నియంత్రించాలని, వాటిని బ్యాన్ చేయాలని కోరుతున్నారు. వీటి బారిన పడి యువత చెడి పోతున్నారని, చాలా మంది మోసాలకు గురై , ప్రాణాలు తీసుకుంటున్నారని ఆవేదన చెందారు. ఇదే సమయంలో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ లక్షలు కూడ బెట్టుకుంటున్న వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
Vishnu Priya Shocking
దీంతో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి సీరియస్ గా ఫోకస్ పెట్టారు. మొత్తం 11 మంది యూట్యూబర్లతో పాటు సినీ రంగానికి చెందిన ప్రముఖ నటులపై కేసులు నమోదు చేశారు. మియాపూర్ లో కొందరిపై కేసులు నమోదు కాగా, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. దెబ్బకు నటీ నటులు తమకు తెలియదని కొందరు, మరికొందరు కరెక్టుగా ఉన్న వాటికే ప్రచారం చేశామంటూ చిలుక పలుకులు పలుకుతున్నారు.
ఇక విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి తరపున టీంలు కీలక ప్రకటనలు చేశాయి. తమ హీరోలకు ఈ యాప్స్ ప్రమోషన్స్ తో సంబంధం లేదంటూ ఊదరగొట్టాయి. దీంతో సీపీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతి ఒక్కరికీ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. దీంతో నటి విష్ణుప్రియ, ఇన్ ఫ్యూయన్సర్ రీతూ చౌదరిని పోలీసులు విచారించారు. ఈ విచారణలో 15 బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినట్లు తేలింది. దీంతో విష్ణు ప్రియ(Vishnu Priya) మొబైల్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆమెను నిందితురాలిగా చేర్చారు. దీంతో ఆమె అరెస్ట్ తప్పదని ప్రచారం జరుగుతోంది.
Also Read : Beauty Samantha Award : ఓటీటీలో ఉత్తమ నటిగా సమంత రుత్ ప్రభు