Crying : ఏదైన కొత్త విషయం తెలుసుకోవడం ప్రతీ ఒక్కరికీ ఇష్టం ఉంటుంది. ఇక ఏడవడం అనేది చాలా కామన్. బాధగా అనిపించినప్పుడు ఎవరైనా ఏడుస్తారు. అయితే ఈ ఏడుపు గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం.
అది ఏమిటంటే? ఎక్కువ మంది రాత్రి సమయంలో ఏడుస్తుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు ఒంటరిగా రాత్రి సమయంలో ఎడుస్తుంటారు. కాగా,ఇప్పుడు చాలా మంది రాత్రిపూటనే ఎందుకు ఏడుస్తారో(Crying ) తెలుసుకుందాం.
Crying :
రాత్రిపూట భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా కష్టం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఉదయం చుట్టుపక్కల ప్రాంతాలను గమనిస్తూ, బంధువులతో మాట్లాడుకుంటూ గడిపేస్తాం.కానీ రాత్రి సమయంలో ఒంటరితనం, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. రాత్రి వేళల్లో ఆందోళనతో చాలా మందికి సరిగ్గా నిద్ర పట్టక ఏడుస్తారు. అయితే అమ్మాయిలు తమ బాధను ఇతరులతో చెప్పుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపరంట. అంతే కాకుండా తాము బాధపడుతున్నట్లు కుటుంబసభ్యులకు తెలిస్తే వారు బాధపడుతారని, రాత్రి సమయంలోనే వారు ఏడుస్తూ తమ బాధను మర్చిపోతారంట.
Also Read : Winter: చలికాలంలో ఆకుకూరలు తినొచ్చా?