War 2 Movie : ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు పాన్ ఇండియా స్టార్ హీరోలు

అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది...

Hello Telugu - War 2 Movie

War 2 : ప్రజెంట్‌ ట్రెండ్‌ ప్రకారం సినిమాలకు హద్దులు, భాషా తారతమ్యాలు లేదు. టాలీవుడ్‌, బాలీవుడ్‌ అదర్‌వుడ్‌ అనే హద్దులు చెరిగిపోయాయి. మంచి కథ అయితే చాలు ఏ భాష సినిమాపైనా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. దానికి తగట్టే హీరోలు కూడా కథలు, కాంబినేషన్‌లు ఎంపిక చేసుకుంటున్నారు. మల్టీస్టారర్‌కు కొత్త డెఫినేషన్‌ ఇస్తున్నారు. టాలీవుడ్‌ హీరో బాలీవుడ్‌ స్టార్‌తో కలిసి సినిమా చేయడం, దానికి పాన్‌ ఇండియా ఇమేజ్‌ రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. మల్టీస్టారర్స్‌లో కూడా కొన్ని కాంబోలు అబ్బా ఏం కాంబినేషన్‌రా అనిపిస్తాయి. టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా అవుతుంటాయి. అలాంటి కలయికే ఎన్టీఆర్‌ – హృతిక్‌ రోషన్‌. వీరిద్దరూ కలిసి ‘వార్‌ 2’లో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘ దేవర’ తరవాత ఈ సినిమా కోసం కాల్షీట్లు కేటాయించాడు తారక్‌. కొన్నాళ్ల క్రితం ‘వార్‌-2’కి సంబంధించిన కొంత చిత్రీకరణ జరిగింది. ఇప్పుడు మరో షెడ్యూల్‌ మొదలైంది. ఎన్టీఆర్‌, హృతిక్‌(Hrithik Roshan) లపై యాక్షన్‌ దృశ్యాలతోపాటు ఓ పాటను తెరకెక్కించనున్నారని సమాచారం.

War 2 Movie Updates

అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ సినిమాలో షారుక్‌ ఖాన్‌ కూడా నటించబోతున్నాడని ముంబై మీడియా చెబుతున్నాయి. ఇందులో షారుఖ్‌ ఓ యాక్షన్‌ ఎపిసోడ్‌ లో కనిపిస్తారని, ‘పఠాన్‌’ సినిమాలో కనిపించిన లుక్‌లో ఉంటారని టాక్‌. అంతేకాదు.. ఎన్టీఆర్‌, హృతిక్‌, షారుఖ్‌ ఈ ముగ్గురూ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తారని తెలుస్తోంది. అదే నిజమైతే థియేటర్లో అభిమానులకు పూనకాలే. షారుక్‌కు గెస్ట్‌ రోల్‌ లో ఎంట్రీ ఇవ్వడం, తన అభిమానుల్ని అలరించడం బాగా సరదా. అందులో భాగంగానే ఈ గెస్ట్‌ రోల్‌ కు ‘ఓకే’ చేశాడని తెలుస్తోంది. ఆయన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే యేడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Also Read : Samantha : సమంతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హీరో వరుణ్ ధావన్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com