War 2 Movie : ‘వార్ 2’ సినిమా తెలుగు కోసం నయా టైటిలా..

గతంలో చిరంజీవి హీరోగా నటించిన ఓ చిత్రానికి ఈ పేరు పెట్టారు...

Hello Telugu - War 2 Movie

War 2 : ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘దేవర’ పార్ట్‌-1 హడావుడి అయిపోయింది. ఇప్పుడు తారక్‌ ‘వార్‌ 2’పై ఫోకస్‌ చేశారు. హృతిక్‌ రోషన్‌ హీరోగా ఎన్టీఆర్‌ కీలక పాత్ర పోషిస్తున్న చిత్రమిది. ఇప్పటికే ఎన్టీఆర్‌ పై కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఇప్పుడు మరో కొత్త షెడ్యూల్‌ కోసం ఎన్టీఆర్‌ ముంబై వెళ్లిపోయాడు. ఈసారి హృతిక్‌, ఎన్టీఆర్‌లపై ఓ పాట చిత్రీకరించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ పాట ఇండియన్‌ స్క్రీన్ పై ఓ అద్భుతం అనుకొనే రీతిలో ఉండబోతున్నట్టు టాక్‌. ఎన్టీఆర్‌, హృతిక్‌ ఇద్దరూ మంచి డాన్సర్లే. కాబట్టి, వాళ్లపై రూపొందించే పాట కూడా అంతే గొప్పగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

War 2 Movie Updates

ఇప్పుడు ‘వార్‌ 2’ కోసం మరో కొత్త వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు తెలుగులో ఓ కొత్త టైటిల్‌ నిర్ణయించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ‘ యుద్థభూమి’ అనే టైటిల్‌ ‘వార్‌ 2(War 2)’ కోసం రిజిస్టర్‌ చేయించారని వార్తలొస్తున్నాయి. ‘ యుద్దభూమి’ అనేది కొత్త టైటిల్‌ ఏం కాదు. గతంలో చిరంజీవి హీరోగా నటించిన ఓ చిత్రానికి ఈ పేరు పెట్టారు. ఈ మధ్యన పాన్‌ ఇండియా సినిమాలకు దేశ వ్యాప్తంగా ఒకే టైటిల్‌ చలామణీలో ఉంటోంది.

ఒకే టైటిల్‌ ఉంటే, అన్ని భాషల్లోనూ త్వరగా రీచ్‌ అవుతుందన్నది దర్శక నిర్మాతల ఆలోచన. అందుకే కొన్ని తమిళ సినిమాలు తమిళ టైటిల్‌తోనే దేశ వ్యాప్తంగా విడుదల అవుతున్నాయి. ఇలాంటి తరుణంలో ‘వార్‌ 2’ కోసం తెలుగులో వేరే టైటిల్‌ పెడతారా? అన్నది చూడాలి. ‘ వార్‌(War)’ సినిమా సూపర్‌ హిట్‌ అయింది. ఇప్పటికే ఆ టైటిల్‌ జనాల్లోకి బాగా వెళ్లిపోయింది. ఇప్పుడు వస్తున్న వార్‌-2 టైటిల్‌ కూడా ఈజీగా రీచ్‌ అవుతుంది. కాబట్టి టైటిల్‌ మార్చే అవకాశం లేదని మరో పక్క వినిపిస్తోంది. మరి ‘వార్‌ 2’ దర్శక నిర్మాతల ఆలోచన ఎలా ఉందో చూడాలి.

Also Read : Naga Chaitanya : తన కాబోయే భార్యతో మిర్రర్ సెల్ఫీ లో నాగ చైతన్య

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com