War 2 : పాన్ ఇండియా హీరోల మధ్య పోటీ వుంటే ఎలా ఉంటుంది. ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఇప్పుడు బాలీవుడ్ నుంచి వస్తున్న చిత్రం వార్ 2 పైనే అందరి ఫోకస్ ఏర్పడింది. ఎందుకంటే ఇందులో నటిస్తున్నది ఎవరో కాదు జూనియర్ ఎన్టీఆర్(Jr NTR), హృతిక్ రోషన్. ఈ ఇద్దరూ కలిసి పోటా పోటీగా వార్-2(War 2) చిత్రంలో నటిస్తున్నారు. డ్యాన్స్ లతో హోరెత్తించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
Jr NTR-Hrithik Roshan War 2 Movie
తాజాగా వార్ 2 కు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి పోటా పోటీగా డ్యాన్స్ చేస్తుండడం విశేషం. 500 మంది నృత్యకారులతో అద్భుతంగా పాటను చిత్రీకరించారు. ఇటీవల సూపర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. దీనిని పాన్ ఇండియా లెవల్లో తీశారు. ఇందులో దివంగత శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ నటించింది. దేవర హిట్ కావడంతో దీనిని సీక్వెల్ గా తీస్తున్నాడు కొరటాల శివ.
బాలీవుడ్ పరంగా వార్ 2 మూవీలో తెరంగేట్రం చేశాడు జూనియర్ ఎన్టీఆర్. దీనిపై ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే దేవరతో ఉత్తరాది ప్రేక్షకుల మనసు గెలిచాడు. ఈ చిత్రం సీక్వెల్ గా వస్తోంది. రోషన్ కథా నాయకుడిగా నటిస్తుండా ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయాన్ ముఖర్జీ వార్ 2 కి దర్శకత్వం వహిస్తుండగా యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు.
Also Read : Tamannaah Love Breakup :ప్రియుడికి బ్రేకప్ చెప్పిన తమన్నా భాటియా