Waltair Veerayya: చెత్త రికార్డు

చెత్త రికార్డు సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి

Hellotelugu-Waltair Veerayya

Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి…. ఈ పేరును తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రికార్డులకు పర్యాయపదంగా చెప్పుకోవచ్చు. పాత్ర ఏదైనా తనదైన శైలిలో హాస్యం, ఫైట్స్, డ్యాన్సులతో ప్రేక్షకులను మైమరపిస్తాడు. చిరంజీవి డ్యాన్స్ ఈజ్ కు ఒక్క తెలుగులోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉంటారు. చిరంజీవి సినిమా అంటే అటు అభిమానులకే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా పండగే… అందుకే చిరంజీవి తన రికార్డులను తానే తిరిగి రాసుకునే పరిస్థితి ఏర్పడుతోంది. రాజకీయల నుండి మరల సినీ రంగ ప్రవేశం చేసిన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా చిరంజీవి రికార్డుల జోరు తగ్గలేదు.

ఆ కోవలోనే మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా వాల్తేరు వీరయ్య సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా.. మాస్ మహారాజ రవితేజ.. కేథరిన్ థెరిస్సా కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి మరోవైపు మాస్ మహారాజ్ రవితేజల కాంబోలో సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా ఈ సినిమా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా… ఓటిటి ఫ్లాట్ ఫాం (నెట్ ఫ్లిక్స్) లో కూడా ఈ సినిమాకు మంచి వ్యూవర్ షిప్ సాధించింది. దీనితో ఇటీవల దసరా పండుగ సందర్భంగా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జెమినీ టీవీలో బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Waltair Veerayya – వాల్తేరు వీరయ్యకు షాకింగ్ టీఆర్పీ

ధియేటర్లలో, ఓటిటి ఫ్లాట్ ఫాంలో సూపర్ కనెక్షన్స్ అందుకున్న వాల్తేరు వీరయ్య…. బుల్లితెరపై మాత్రం వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) షాకింగ్ టీఆర్పీ రేటింగ్స్ ను దక్కించుకుంది. కేవలం 5.14 టీఆర్పీ రేటింగ్ ను మాత్రమే టీవీలో ఈ సినిమా రాబట్టింది. చిరంజీవి లాంటి పెద్ద హీరోకు ఇంత తక్కువ టీఆర్పీ రేటింగ్స్ అవమానంగా సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇద్దరు హీరోలు నటంచిన ఈ సినిమాకు అంత తక్కువ టీఆర్పీ రేటింగ్ రావడం అందరినీ షాక్ కు గురి చేస్తోంది.
ధియేటర్లలోను, ఓటీటీలోను అదరగొట్టిన ఈ సినిమా.. టీవీ ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేదు. అర్బన్‌లో 5.14 టీఆర్పీ రాగా, రూరల్ అండ్ అర్బన్‌లో 4.56 మాత్రమే వచ్చింది. థియేటర్లు, ఓటీటీలో రిలీజ్ కావడంతో టీవీలో చూసేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదని, అందుకే తక్కువ టీఆర్పీ రేటింగ్స్ వస్తాయని మెగా ఫ్యాన్స్ చెబుతున్నారు. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 865 థియేటర్స్‌లో విడుదల అవ్వగా.. బాక్సాఫీస్ దగ్గర 200 కోట్లకుపైగా వసూలు చేసింది. చిరంజీవి కెరీర్‌లో అమెరికాలో 2 మిలియన్ అందుకున్న మూడో సినిమాగా ఇది నిలిచింది.

Also Read : Dunki Movie : రూట్ మార్చిన షారూక్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com