Vithika Sheru : అమీర్ ఖాన్, షారూక్ ఖాన్, హృతిక్ రోషన్ వంటి హీరోల సిక్స్ ప్యాక్ చూసిన తరువాత… టాలీవుడ్ హీరోలు కూడా సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేసారు. వీరిలో సుధీర్ బాబు, సునీల్, జూనియర్ ఎన్టీఆర్ లు… సిక్స్ ప్యాక్ లు సాధించడంలో సక్సెస్ అయ్యారు. అయితే హీరోలకు సిక్స్ ప్యాక్ కావాల్సిందే ఎందుకంటే అవి వారి యాక్సన్ సీక్వెన్స్ కు హెల్ప్ చేస్తాయి అదే విధంగా వారి అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. అదే సిక్స్ ప్యాక్ హీరోయిన్స్ ట్రై చేస్తే గ్లామర్ పోయి సినిమాలు కూడా చేజారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే టాలీవుడ్ కి చెందిన వితిక షేరు(Vithika Sheru) మాత్రం… తన సిక్స్ ప్యాక్ తో అందరినీ అలరిస్తోంది.
Vithika Sheru – సంచలనం సృష్టిస్తున్న టాలీవుడ్ బ్యూటీ వితిక షేరు సిక్స్ ప్యాక్
ఇప్పటివరకు హీరోల సిక్స్ ప్యాక్స్ చూసిన అభిమానులు, నెటిజన్లు ఇప్పుడు ఓ టాలీవుడ్ హీరోయిన్ సిక్స్ ప్యాక్ చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. హ్యాపీడేస్, కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన వరుణ్ సందేశ్ భార్య వితిక షేరు కూడా తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాల్లో నటించింది. ఇటీవల తన భర్తతో కలిసి బిగ్ బాస్ అనే రియాలిటీ షోలో కూడా పాల్గొన్నారు. ఫిట్ నెస్ కు ప్రాధాన్యం ఇస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే వితిక షేరు… తరచూ తన జిమ్ వర్కౌట్స్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో సిక్స్ ప్యాక్ తో ఆమె తాజాగా షేర్ చేసిన ఫోటోలను చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గ్లామర్ బ్యూటీ ఇలా గంటల తరబడి జిమ్ వర్కౌట్స్ చేస్తూ సిక్స్ ప్యాక్ చేయడం నిజంగా అభినందనీయం అంటూ ప్రశంసిస్తున్నారు. టాలీవుడ్ సిక్స్ ప్యాక్ బ్యూటీ అంటూ వితిక సిక్స్ ప్యాక్ ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
Also Read : Allari Naresh: ‘బచ్చలమల్లి’ బయోపిక్ లో అల్లరి నరేష్