Viswambhara : మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం ‘విశ్వంభర’. ఈ చిత్రానికి యువ దర్శకుడు వశిష్ఠ దర్శకత్వం వహించనున్నారు. వశిష్ఠ గతంలో కళ్యాణ్ రామ్‌తో బింబిసార అనే చిత్రం చేసారు. బింబిసార సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. హిస్టారికల్ కంటెంట్ ఉన్న బింబిసార చిత్రానికి వశిష్ట దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ యువ దర్శకుడు పెద్ద స్టార్ చిరంజీవితో ఓ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా కూడా ఫాంటసీ కథతో రూపొందిస్తున్నాడు. ఈ చిత్రానికి “విశ్వంభర` అనే పవర్‌ఫుల్ టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. మెగాస్టార్ చిరంజీవి ఫిబ్రవరి 10 నుంచి షూటింగ్‌లో పాల్గొననున్నారు.
Viswambhara Movie Updates
విశ్వంభర విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారని టాకు తెలిసింది. ఇప్పటికే అనుష్క, హనీ రోజ్ పేర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా, తాజాగా అందర తార త్రిష ఈ సినిమా సెట్స్ పైకి వచ్చింది. ఆమె త్రిష ‘విశ్వంభర’ కథానాయిక.
రీసెంట్ గా షూటింగ్ కి కూడా వచ్చింది. త్రిషకు మెగాస్టార్ చిరంజీవి స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియోను చిరు(Chiranjeevi) తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. గతంలో వీరిద్దరూ కలిసి “స్టాలిన్” సినిమాలో నటించారు. ఆచార్య సినిమాలో కూడా త్రిషనే హీరోయిన్ గా చేయాలని అనుకున్నా అనుకోని కారణాల వల్ల అది కుదరలేదు. ఇప్పుడు ఈ జంట విశ్వంభరతో మరోసారి ప్రేక్షకులను అలరించనుంది.
Also Read : Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ మరో కొత్త భామను ఒడిలో పెట్టుకొని…