Viswam: గోపీచంద్ ‘విశ్వం’ నుండి మొరాకో మగువా సాంగ్ రిలీజ్ !

గోపీచంద్ ‘విశ్వం’ నుండి మొరాకో మగువా సాంగ్ రిలీజ్ !

Hello Telugu - Viswam

Viswam: ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్, కావ్య థాపర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా సినిమా ‘విశ్వం(Viswam)’. స్టైలిష్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వి.కె.నరేశ్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్‌ రెడ్డి, ప్రగతి, అజయ్‌ ఘోష్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజైన టీజర్‌ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ‘విశ్వం’మూవీ నుంచి ‘మొరాకో మగువా’ అనే సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Viswam Movie Updates

ఎలక్ట్రిఫైయింగ్, గ్రూవీ నంబర్ అయిన ఈ ‘మొరాకో మగువా’ సాంగ్‌ తో మేకర్స్ మ్యూజికల్ జర్నీ కిక్ స్టార్ట్ చేశారు. చేతన్ భరద్వాజ్ స్కోర్ చేసిన ఈ డైనమిక్ సాంగ్‌ కు పృధ్వీ చంద్ర, సాహితీ చాగంటి ఎనర్జిట్ వోకల్స్ అందించారు. లైవ్లీ టెంపో, షిఫ్టింగ్ రిధమ్స్‌తో వచ్చిన ఈ సాంగ్ వినగానే ఎక్కేస్తుంది. రాకేందు మౌళి లిరిక్స్ తెలుగు, ఇంగ్లీష్‌ని అద్భుతంగా బ్లెండ్ చేసింది. గోపీచంద్, కావ్య థాపర్ రొమాంటిక్ కెమిస్ట్రీ, ఎలిగెన్స్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో కట్టిపడేశారు. ఎక్సోటిక్ లొకేషన్స్‌లో చిత్రీకరించిన విజువల్స్ వావ్ అనేలా ఉన్నాయి. ‘మొరాకో మగువా’ సాంగ్ మ్యూజిక్ ప్రమోషన్స్‌కు చార్ట్ బస్టర్ స్టార్ట్ ఇచ్చింది.

ఈ సినిమాకి కెవి గుహన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, శ్రీనువైట్ల పలు బ్లాక్‌బస్టర్స్‌తో అనుబంధం ఉన్న గోపీ మోహన్ స్క్రీన్‌ప్లే రాశారు. ఎడిటర్‌గా అమర్‌రెడ్డి కుడుముల, ఆర్ట్‌ డైరెక్టర్‌ కిరణ్‌ మన్నె వర్క్ చేస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 11న ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Also Read : Samyuktha Menon: శర్వా 37 నుండి సంయుక్త ఫస్ట్ లుక్ విడుదల !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com