Vishwak Sen: ప్రతీ సినిమాలో కొత్తదనంతో ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకున్న అతి కొద్ది మంది యువ హీరోల్లో విశ్వక్ సేన్ ఒకరు. వివాదాలను కూడా తన సినిమా ప్రమోషన్ గా ఉపయోగించుకునే ఈ యువ హీరో…. మెట్రో రెట్రో అనే నోబుల్ కాజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నోబుల్ కాజ్ ఆర్గాన్ డొనేషన్ కు సపోర్ట్ చేయడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విశ్వక్ సేన్ తన ఆర్గాన్స్ డొనేట్ చేస్తున్నట్లు ప్రకటించి చాలా మందికి ఆదర్శంగా నిలిచారు. ఆర్గాన్ డొనేషన్ పై అవగాహన కల్పిస్తూ ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న విశ్వక్ పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొవాలని, తద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడాలని కోరారు విశ్వక్.
Vishwak Sen Donated
విశ్వన్సేన్తో బ్లాక్‌బస్టర్ హిట్‌ని తీసిన దర్శకుడు శైలేష్ కొలను కూడా ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. ఇటివలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో సినిమాతో అలరించిన విశ్వక్ సేన్ త్వరలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మెకానిక్ రాకీ’తో రాబోతున్నారు.
Also Read : Aamir Khan: షూటింగ్ పూర్తి చేసుకున్న అమీర్ ఖాన్ ‘సితారే జమీన్ పర్’ !