Vishwak Sen: లవర్ బాయ్, మాస్ హీరో గెటప్ లతో ఇంతవరకు ప్రేక్షకులను అలరించిన మాస్ కా దాస్ విశ్వక్ సేన్… ‘గామి’ సినిమాతో అఘోరా పాత్రలో ఓ కొత్త లుక్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మానవ స్పర్శను అనుభవించలేని అరుదైన వ్యాధితో బాధపడుతున్న అఘోరా పాత్రలో విశ్వక్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్ పై కార్తీక్ శబరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు విద్యాధర్ కాగిత దర్శకత్వం వహిస్తున్నారు. ‘గామి’ సినిమాకు సంబంధించిన… ఫస్ట్ లుక్, మేకింగ్ వీడియో ఇతర ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే ఆసక్తిని రేకెత్తించగా… తాజాగా ‘గామి’ ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ టీజర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ప్రస్తుతం ఈ క్యారెక్టర్ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
Vishwak Sen – ఆసక్తికరంగా ‘గామి’ టీజర్ !
చిత్ర యూనిట్ విడుదల చేసిన ఈ టీజర్‌లో… విశ్వక్ సేన్(Vishwak Sen) తన సమస్యకు నివారణను చెప్పే వాయిస్ ఓవర్ తో వీడియో ప్రారంభమైంది. ఎంజీ అభినయ, చాందిని చౌదరి, ఇతర ముఖ్యమైన పాత్రలు ఒకదాని తర్వాత మరొకటి పరిచయం చేయబడుతూ… చివరగా, విశ్వక్‌ని… శంకర్ అనే అఘోరాగా పరిచయం చేశారు. ‘ఇవన్నీ దాటుకొని నా వల్ల అవుతుందంటారా?’ అని విశ్వక్ చెప్పడం ఆసక్తిగా వుంది. చివరి విజువల్స్‌లో విశ్వక్, చాందిని హిమాలయ పర్వతాలను ట్రెక్కింగ్ చేస్తున్నట్లు చూపించారు. ఈ టీజర్‌లోని పాత్రలు చాలా ఎక్సయిటింగ్ గా ఉండటమే కాకుండా… ఓ కొత్త తరహా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఫీల్ ని ఇస్తున్నాయి. ఈ టీజర్ లో ఫిబ్రవరి 29న థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు. ట్రైలర్‌తో ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాను మార్చి 8న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు ఇదివరకే చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read : Hero Yash: కిరాణా షాపులో ఐస్ క్యాండీ కొంటున్న కేజీఎఫ్ హీరో ! ఫోటోలు వైరల్ !