Vishwak : టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలోనే అరుదైన గుర్తింపు స్వంతం చేసుకున్నాడు నటుడు విశ్వక్ సేన్. తను ముందు నుంచి భిన్నమైన పాత్రలను ఎంచుకుంటున్నాడు. నందమూరి నట సింహం బాలయ్య తనకు పుల్ సపోర్ట్ . సిద్దూ జొన్నలగడ్డ విశ్వక్ సేన్(Vishwak) లు ఇద్దరూ మంచి స్నేహితులు. తమ కెరీర్ లో కీలకమైన పాత్రలను ఎంచకునేందకే వీరు ప్రయారిటీ ఇస్తున్నారు.
Vishwak Sen Movie Updates
గతంలో అమ్మాయి పాత్రలో నటించిన నటులు చాలా మంది ఉన్నారు. వారిలో కమెడియన్, బెస్ట్ యాక్టర్ గా పేరొందిన రాజేంద్ర ప్రసాద్ తో పాటు కమల్ హాసన్ ,అక్కినేని నాగార్జున, తదితరులు చేశారు. తాజాగా విశ్వక్ సేన్ కూడా అలాంటి పాత్రలో లైలా అనే సినిమాలో నటిస్తున్నాడు.
ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తుండగా షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆకాంక్ష శర్మ కథానాయిక కావడం విశేషం. చిత్రానికి సంబంధించి కొన్ని ఎపిసోడ్స్ లలో విశ్వక్ సేన్ పూర్తిగా అమ్మాయి పాత్రలో నటిస్తున్నాడని దర్శకుడు వెల్లడించాడు. సంక్రాంతి పండుగ సందర్బంగా మూవీ మేకర్స్ లైలాకు సంబంధించి విశ్వక్ సేన్ అమ్మాయిగా ఉన్న ఫోటోను విడుదల చేశారు.
దీనికి బిగ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం విడుదలైన ఈ పోస్టర్ తెగ ఆకట్టుకుంటోంది . విశ్వక్ సేన్ ఫ్యాన్స్ పుల్ ఖుషీలో ఉన్నారు.
Also Read : Hero Bunny-Pushpa 2 : మరో కొత్త స్ట్రాటజీతో రానున్న ‘పుష్ప 2’ టీమ్