Mechanic Rocky : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన అప్ కమింగ్ మూవీ ‘మెకానిక్ రాకీ(Mechanic Rocky)’తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి రవితేజ ముళ్లపూడి రచన, దర్శకత్వం వహించారు. నిర్మాత రామ్ తాళ్లూరి తన SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు. తాజాగా ఈ సినిమా సెకండ్ సింగిల్ రిలీజ్ అప్డేట్‌ను మేకర్స్ తెలియజేశారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గేర్, హ్యుజ్ బజ్ క్రియేట్ చేయగా.. జెక్స్ బిజోయ్ కంపోజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ‘గుల్లెడు గుల్లెడు’ సాంగ్ సూపర్బ్ స్పందనను రాబట్టుకుంది.
ఇప్పుడు సెకండ్ సింగిల్ ‘ఓ పిల్లో’ సాంగ్‌ను సెప్టెంబర్ 18న విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరిల లవ్లీ కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. వర్షం పడుతుంటే.. మీనాక్షికి విశ్వక్ గొడుకు పడుతూ.. మైకంగా ఆమెనే చూస్తూ ఉన్నారు. ఈ పోస్టర్ చూస్తుంటే.. రాబోయే ‘ఓ పిల్లో’ మంచి మెలోడీ సాంగ్ అనేది అర్థమవుతోంది.
Mechanic Rocky Movie Updates
మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి జెక్స్ బిజోయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. మనోజ్ కాటసాని సినిమాటోగ్రఫీ, అన్వర్ అలీ ఎడిటింగ్, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తోన్న ఈ చిత్రానికి సత్యం రాజేష్, విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు. ‘ మెకానిక్ రాకీ’ సినిమాను దీపావళి స్పెషల్‌గా అక్టోబర్ 31న విడుదల చేయబోతున్నారు.
Also Read : Megha Akash : వివాహ బంధంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ తార మేఘ