Vishnu Priya : బెట్టింగ్ యాప్స్ వ్యవహారం తెలుగు చలన చిత్ర రంగంలో కలకలం రేపింది. 11 మంది యూట్యూబర్స్ తో పాటు ప్రముఖ సెలిబ్రిటీలపై కూడా హైదరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు ఇన్ ఫ్యూయర్స్ కు నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాల్సిందిగా స్పష్టం చేయడంతో రీతూ చౌదరితో పాటు యాంకర్, నటి విష్ణు ప్రియ(Vishnu Priya) హాజరయ్యారు. ఈసందర్బంగా తన వాంగ్మూలంలో కీలక విషయాలు బయట పెట్టినట్లు సమాచారం.
Vishnu Priya Case
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో భాగంగా భారీగా డబ్బులు తీసుకున్నట్లు కూడా ఒప్పుకున్నట్లు తెలిసింది. మొత్తం ఇప్పటి వరకు 15 బెట్టింగ్ యాడ్స్ ప్రమోషన్స్ చేసినట్లు విష్ణుప్రియ విచారణలో భాగంగా వెల్లడించినట్టు టాక్. వీటిని ఇన్ స్టా గ్రామ్ సామాజిక వేదికగా ప్రమోట్ చేసింది. దీంతో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి విష్ణుప్రియ నుంచి మొబైల్ ఫోన్, అందులో ఎవరెవరితో మాట్లాడింది, ఏయే బెట్టింగ్ యాప్స్ ను డౌన్లోడ్ చేసింది, వాటి వివరాలను పూర్తిగా తనిఖీ చేశారు.
అంతేకాకుండా తనకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ కూడా పరిశీలించారు. ఇంకో వైపు బిగ్ షాక్ ఇచ్చారు ఖాకీలు. ఏకంగా ఆమె మొబైల్ ను కూడా సీజ్ చేశారు. దీంతో అవాక్కయింది నటి విష్ణు ప్రియ. తాజాగా సినీ నటులకు సంబంధించి రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, శ్రీముఖి, మంచు లక్ష్మిలపై కూడా కేసులు నమోదు కావడం విశేషం. వీరికి కూడా నోటీసులు జారీ చేసింది పోలీస్ శాఖ.
Also Read : Beauty Parvathy Thiruvothu : ఆ పాత్ర సవాళ్లతో కూడుకున్నది