Vishnu Manchu: టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన భార్య విరానికా రెడ్డికి బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా షూటింగ్ లో బాగంగా న్యూజీలాండ్ లో ఉన్న విష్ణు(Vishnu Manchu)… తమ 15వ వివాహా వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక హెలీకాఫ్టర్ లో విరానికాను షికారుకు తీసుకెళ్లారు. ఆకాశంలో ప్రయాణిస్తుండగా పెళ్ళిరోజు శుభాకాంక్షలు తెలిపాడు. దీనిని చాలా సర్ ప్రైజ్ గా ఫీలయిన విరానికా… తనభర్తకు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘ఇలాంటి అద్భుతమైన సర్ ప్రైజ్ ఇచ్చినందుకు థ్యాంక్యూ సో మచ్. అస్సలు ఊహించలేదు. ఇవన్నీ బాగా ప్లాన్ చేశావు. నీతో ప్రతిరోజు ఒక అడ్వెంచర్ లా ఉంటుంది. హ్యాపీ 15 మై లవ్’ అంటూ తన భర్తకు విషెస్ చెప్పింది విరానిక. దీనితో మంచు కుటుంబం అభిమానులతో పాటు సినీ ప్రముఖులు ఈ జంటకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Vishnu Manchu Surprise to his Wife
మంచు మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విష్ణు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విరానికా రెడ్డిని మార్చి 1, 2009న ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు అరియానా, వివియానా, ఐరా, అర్వం అనే నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. విష్ణు భార్య విరానికా ఫ్యాషన్ డిజైనర్ గా, వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ప్రస్తుతం మంచు ఫ్యామిలీ అంతా తమ డ్రీప్ ప్రాజెక్టు కన్నప్ప సినిమాతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి కాగా… సెకండ్ షెడ్యూల్ కోసం న్యూజిలాండ్‌కు బయలుదేరి వెళ్లారు. అయితే సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నప్పటికీ తన ఫ్యామిలీ కోసం సమయం కేటాయిస్తూ ఉంటారు. మార్చి 1న తన 15వ వివాహా వార్షికోత్సవం సందర్భంగా భార్య విరానికా కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో కన్నప్ప షూట్ లో ఉన్న మంచు విష్ణు… భార్య కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించి సర్ ప్రైజ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను విరానికా తన ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో… ఇది చూసిన అభిమానులు టాలీవుడ్ జంటకు పెళ్లి రోజు విషెస్ చెబుతున్నారు.
Also Read : Hanu-Man: ‘హను-మాన్’ సినిమా మరో రికార్డ్ ! 150 థియేటర్లలో 50 రోజులు !