Vishal: వరలక్ష్మి శరత్‌ కుమార్‌ నిశ్చితార్థంపై విశాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !

వరలక్ష్మి శరత్‌ కుమార్‌ నిశ్చితార్థంపై విశాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !

Hello Telugu - Vishal

Vishal: హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, లేడీ విలన్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దక్షిణాది నటి వరలక్ష్మి శరత్ కుమార్… ఇటీవలే ప్రముఖ గ్యాలరిస్ట్‌ నికోలయ్‌ సచ్‌దేవ్‌ తో నిశ్చితార్థం జరిగింది. తన 14 ఏళ్ళ తన స్నేహ, ప్రేమ బంధానికి ముగింపు పలికి వివాహ బంధంలోనికి అడుగుపెట్టడానికి తొలి అడుగు వేసింది. దీనితో వరలక్ష్మి శరత్ కుమార్ నిశ్చితార్ధంపై తాజాగా నటుడు విశాల్‌(Vishal) స్పందించారు. ఆమె వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నందుకు సంతోషంగా ఉన్నానని చెప్పారు. మరీ ముఖ్యంగా కెరీర్‌పరంగా ఆమె అనుకున్నది సాధించిందని తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పేరు ప్రఖ్యాతులు అందుకుందని అందుకు తానెంతో ఆనందంగా ఉన్నానని చెప్పారు. ‘హను-మాన్‌’లో వరలక్ష్మి ఫైట్స్‌ కూడా చేయడం బాగుందన్నారు.

Vishal Comments ViVishal

‘పందెంకోడి 2’ కోసం విశాల్‌ – వరలక్ష్మి కలిసి పనిచేసారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని జోరుగా ప్రచారం సాగింది. ఆ సమయంలో విశాల్‌ పుట్టినరోజును ఆమె ప్రత్యేకంగా సెలబ్రేట్‌ చేయడం ఆ కథనాలకు ఆజ్యం పోసినట్లయింది. తమ గురించి జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని… తాము కేవలం చిన్ననాటి స్నేహితులం మాత్రమేనని అప్పట్లో ఈ జోడీ క్లారిటీ ఇచ్చింది. సినిమాల విషయానికి వస్తే… విశాల్‌ ప్రస్తుతం ‘రత్నం’ రిలీజ్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. హరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 26న విడుదల కానుంది. మరోవైపు, ‘హనుమాన్‌’తో ఇటీవల విజయాన్ని అందుకున్నారు వరలక్ష్మి. ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘శబరి’ త్వరలో విడుదల కానుంది. ధనుష్‌ హీరోగా నటిస్తోన్న చిత్రంలోనూ ఆమె కీలకపాత్ర పోషిస్తున్నారు.

Also Read : Allu Arjun : పుష్ప రాజ్ ను ప్రశంసలతో ముంచెత్తిన బోలీవుడ్ ప్రముఖ దర్శకుడు

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com