Vishal: కోలీవుడ్ అగ్రహీరో విశాల్ సిబీఐ విచారణకు హాజరయ్యారు. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ పై ఇటీవల చేసిన ఆరోపణలపై సిబీఐ కేసు నమోదు చేసిన నేపథ్యంలో… ఈ కేసు విచారణలో భాగంగా ముంబై లోని సీబీఐ కార్యాలయానికి వెళ్ళినట్లు… ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ సందర్భంగా సీబీఐ అధికారులు తనను విచారించిన తీరును ఈ పోస్టు ద్వారా వివరించారు.
సీబీఐ ఆఫీసుకు వెళ్తానని నా జీవితంలో ఎప్పుడూ ఊహించలేదు. నాకు ఇది పూర్తిగా కొత్త అనుభవం. సీబీఐ అధికారులు విచారించిన తీరుపై నేను సంతృప్తిగా ఉన్నాను. సీబీఐ కార్యాలయం ఎలా ఉండాలనే దానిపై వాళ్లు నా నుండి కొన్ని సూచనలు తీసుకున్నారు. రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ అవినీతిపై పోరాడాల్సిన అవసరం ఉంది’ అని విశాల్(Vishal) ఈ పోస్టు ద్వారా తెలిపారు.
Vishal – సీబిఐ కేసుకు విశాల్ కు సంబంధం ఏంటి
అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో విశాల్, ఎస్ జే సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘మార్క్ ఆంటోని’. అయితే ఈ సినిమా హిందీ వెర్షన్ సెన్సార్ విషయంలో సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అధికారులకు లంచం ఇవ్వాల్సి వచ్చిందని ఆయన ఆరోపించారు. ఈ ‘మార్క్ ఆంటోని’ సినిమా సెన్సార్ కోసం దాదాపు రూ 6.5 లక్షలు లంచంగా చెల్లించానని సంచలన ఆరోపణలు చేసారు.
భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఏ నిర్మాతకు రాకూడదని దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రధాని మోదీని, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేను విశాల్ కోరారు. విశాల్ ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ పై సీబీఐను రంగంలోకి దించింది. దీనితో సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు విచారణలో భాగంగా… CBFC పై అవినీతి ఆరోపణలు చేసిన విశాల్ ను ముంబై కార్యాలయానికి పిలిచి విచారించారు.
Also Read : Keeda Cola: ఓటీటీలోనికి కీడా కోలా… స్ట్రీమింగ్ ఎప్పుడంటే…