Virat Kohli : దుబాయ్ – భారత క్రికెట్ జట్టు మాజీ స్కిప్పర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను ఫామ్ కోల్పోవడానికి ప్రధాన కారణం ఏమిటో చెప్పాడు. తనకు ఇష్టమైన షాట్ కవర్ డ్రైవ్ ఆడడమని. తాను మైదానంలోకి వచ్చిన వెంటనే ఆ షాట్ ఆడేందుకు ప్రయత్నం చేస్తానని తెలిపాడు. దీనిని ఆడేందుకు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టిందని, అందుకే ఎక్కడ పొరపాటు చేశాననే విషయంపై దృష్టి సారించానని అన్నాడు.
Virat Kohli Shocking Comments
దుబాయ్ వేదికగా ఛాయింపియన్ షిప్ 2025 వరల్డ్ కప్ జరుగుతోంది. ఇందులో భాగంగా చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ జట్టుతో సూపర్ సెంచరీ సాధించాడు విరాట్ కోహ్లీ. కేవలం 111 బంతులు మాత్రమే ఎదుర్కొని 100 పరుగులు చేశాడు. తనకు ఎదురే లేదని చాటాడు. పూర్తిగా ఫిట్ నెస్ గా ఉండేందుకు నిరంతరం ప్రయత్నం చేస్తానని అన్నాడు. ఇదే తన విజయ రహస్యమని పేర్కొన్నాడు.
ఇదిలా ఉండగా పాకిస్తాన్ తో చేసిన సెంచరీతో విరాట్ కోహ్లీ వన్డే కెరీర్ లో 51 సెంచరీలు పూర్తయ్యాయి. ప్రపంచ క్రికెట్ చరిత్రలో తను మూడో స్థానంలో నిలిచాడు. సచిన్ టెండూల్కర్ తో సమానంగా ఉన్నాడు. మొత్తం ఇప్పటి వరకు 14,000 రన్స్ చేశాడు స్టార్ క్రికెటర్. ప్రస్తుతం తాను చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
Also Read : Hero Nani-Hit 3 Teaser :నేచురల్ స్టార్ నాని హిట్ 3 టీజర్ సూపర్