Virat Anushka: టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ తమ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇండియా-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు వ్యక్తిగత కారణాలతో దూరమైన విరాట్ కోహ్లీ… అభిమానులకు అదిరిపోయే న్యూస్ చేప్పాడు. ఫిబ్రవరి 15న అనుష్క శర్మ పండండి బిడ్డకు జన్మనిచ్చినట్లు తన సోషల్ మీడియా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రకటించాడు. అంతేకాదు తమ బాబుకు ‘అకాయ్’ గా నామకరణం చేసినట్లు తెలిపాడు. ‘‘మేం ఫిబ్రవరి 15న మా కుమారుడు అకాయ్ (వామిక తమ్ముడు)ను ఈ లోకంలోకి స్వాగతించాం. మా జీవితంలోని ఈ మధురమైన క్షణాల్లో మీ ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు కోరుకుంటున్నాం. మా గోప్యతను గౌరవించండి’’ అని విరాట్ ట్వీట్ లో పేర్కొన్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ(Virat Kohli) ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. మరోవైపు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Virat Anushka Blessed with..
2008లో రబ్ నే బనాదీ జోడీ అనే సినిమాతో షారూక్ ఖాన్ సరసన నటించి బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అనుష్క శర్మ… ఆ తరువాత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఓ యాడ్ షూటింగ్ లో టీమిండియా స్టార్ బ్యాట్సమన్ విరాట్ కోహ్లీను(Virat Kohli) కలిసిన అనుష్క శర్మ… అతనితో ప్రేమలో పడింది. ఇరు కుటుంబాల ఆమోదంతో 2017లో ఇటలీలో డెస్టినేషల్ వెడ్డింగ్ చేసుకున్నారు. స్టార్ కపుల్స్ లో ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ విరుష్క దంపతులు 2021లో వమికా అనే ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అయితే రెండో ప్రెగ్నెన్సీను మాత్రం వారు చాలా గోప్యంగా ఉంచారు.
అయితే ఫిబ్రవరి 15న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు… విరాట్ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఇదిలా ఉండగా… అకాయ్ అనగా టర్కీష్ భాషకు సంబంధించిన పదం. ఈ పదానికి అర్ధం దేదిప్యంగా వెలిగే చంద్రుడు అని అర్థం. తొలి సంతానానికి వమికా అని పేరు పెట్టడం తెలిసిందే. వమికా అంటే సంస్కృత భాషలో దుర్గమాత అని అర్థం. ఇలా తమ బిడ్డలకు సంస్కృతం, టర్కీష్ భాషలో పేరు పెట్టడం విశేషంగా మారింది.
Also Read : Ileana D’Cruz: బేబీ బంప్ తో బికనీలో ఇలియానా !