Vimala Raman: ఎవరైనా ఎప్పుడైనా, గాయం 2, ‘గాండీవధారి అర్జున’ వంటి సినిమాలతో టాలీవుడ్ లో గుర్తింపు పొందిన భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియా నటి విమలా రామన్. 2006లో తమిళ సినిమా ‘పోయ్’ సినిమాతో కోలీవుడ్ లో అడుగుపెట్టిన విమలా రామన్… తమిళంతో పాటు పలు తెలుగు, మలయాళం, కన్నడ, ఇంగ్లీషు సినిమాల్లో కూడా నటించింది. ఇటీవల 42వ ఏట అడుగుపెట్టిన ఈ ఆస్ట్రేలియా ముద్దుగుమ్మ… ఇంకా బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. దీనితో విమలా రామన్ పెళ్లి చేసుకోబోయే వరుడు గురించి గతంలో పలు పుకార్లు షికార్లు చేసేవి. అయితే ఆ పుకార్లపై ఎప్పుడూ స్పందించని విమలా రామన్… తాజాగా ప్రియుడితో తీసుకున్న రొమాంటిక్ ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. దీనితో గత కొన్నాళ్ల నుంచి వీళ్ల బంధంపై వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టి త్వరలో పెళ్లి పీటలెక్కడం పక్కా అనిపిస్తుంది.
Vimala Raman Relation
ఆస్ట్రేలియాలో భారతి సంతతికి చెందిన కుటుంబంలో పుట్టి పెరిగిన విమలా రామన్(Vimala Raman)… ప్రస్తుత వయసు 42 ఏళ్లు. అయితే ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. కానీ గత కొన్నాళ్ల నుంచి నటుడు వినయ్ రాయ్ తో కనిపిస్తోంది. బయటకు చెప్పకనప్పటికీ వీళ్ల బంధం గురించి ఇప్పటికే చాలాసార్లు రూమర్స్ వచ్చాయి. కానీ తాజాగా VV (వీవీ) పేరుతో ఫొటోషూట్ చేస్తున్నారు. ఈ ఫొటోల్ని విడతల వారీగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే లేటు వయసులో వినయ్ రాయ్ -విమలా రామన్ పెళ్లికి రెడీ అయిపోతున్నారా ? అనే సందేహం వస్తోంది. ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలోని చాలామంది పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నారు. మరి ఆ లిస్టులోకి హీరోయిన్ విమలా రామన్ కూడా చేరుతుందా లేదా చూడాలి.
Also Read : Kannappa : మే 13న కన్నప్ప సినిమా నుంచి కీలక అప్డేట్ ఉందంటున్న మంచు విష్ణు