Vikram : తమిళ సినీ రంగంలో స్టార్ ఇమేజ్ స్వంతం చేసుకున్న నటుడు చియాన్ విక్రమ్. తను రంజిత్ పా దర్శకత్వంలో నటించిన తంగళాన్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా మరో సినిమాతో ముందుకు రాబోతున్నాడు. కోలీవుడ్ స్టార్ ను భిన్నంగా చూపించేందుకు దర్శకుడు ప్రయత్నం చేస్తున్నాడు ఈ సినిమా ద్వారా.
Vikram ‘Veera Dheera Sooran’ Movie Updates
ఏ పాత్ర ఇచ్చినా దర్శకుడి అంచనాలకు మించి ప్రాణం పోసే అరుదైన నటుడు చియాన్ విక్రమ్(Vikram). తను అత్యంత టాలెంట్ కలిగిన నటుల్లో ఒకడిగా పేర్కొన్నాడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ మధ్య. తమిళంలో చిన్నా చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. కోట్లు కురిపించింది. ఈ చిత్ర దర్శకుడు అరుణ్ కుమార్ ఇప్పుడు విక్రమ్ తో వీర ధీర సూరన్ తీస్తున్నాడు. ఇది పాన్ ఇండియాగా తెరకెక్కుతోంది.
భారీ బడ్జెట్ తో దీనిని నిర్మించారు. తాజాగా మూవీ మేకర్స్ కీలక ప్రకటన చేశారు. విడుదల డేట్ ను కన్ ఫర్మ్ చేశారు. వీర ధీర సూరన్ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా వచ్చే మార్చి 27న విడుదల చేస్తామంటూ ప్రకటించారు.
ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరో వైపు దిగ్గజ దర్శకుడు మురుగ దాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటిస్తున్న సికిందర్ మూవీ మార్చి 28న రిలీజ్ కానుంది. రెండు సినిమాలు పోటీ పడుతుండడం విశేషం.
Also Read : Mika Singh-Saif Attack : సైఫ్ ను సేఫ్ చేసిన ఆటో డ్రైవర్ కు నజరానా