Vijayasanthi: టాలీవుడ్ లో అగ్రహీరోలకు ధీటుగా క్రేజ్ సంపాదించుకున్న నటి విజయశాంతి. లేడీ అమితాబ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి… 1998లో సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వెళ్ళిపోయింది. తొలుత బిజేపిలో చేరిన విజయశాంతి ప్రత్యేక తెలంగాణా సాధన కోసం 2005లో తల్లి తెలంగాణా పార్టీ పెట్టింది. అయితే 2009లో తన పార్టీను టీఆర్ఎస్ లో విలీనం చేసి మెదక్ స్థానం నుండి ఎంపీగా గెలుపొందింది. 2013లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందన్న ఆరోపణలపై ఆమెను టీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయడా కాంగ్రేస్ లో చేరింది. కాంగ్రేస్ నుండి మరల బిజేపికి… బిజేపి నుండి మరల ఇటీవలే కాంగ్రెస్ లో చేరింది. 1979లో సినిమాలో అడుగుపెట్టిన విజయశాంతి…. రాజకీయాల్లోనికి వెళ్ళిన తరువాత పూర్తిగా సినిమాకు గుడ్ బై చెప్పింది. అయితే 2020లో మహేశ్ బాబు-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించి తన సెకండ్ ఇన్నింగ్స్ కు నాంది పలికింది. అయితే ఆ తరువాత ఆమె ఏ సినిమాలో కనిపించలేదు.
Vijayasanthi – మరల మూడేళ్ళ తరువాత మేకప్ వేసుకోనున్న విజయశాంతి
ఇటీవల మరల కాంగ్రెస్ లో చేరి తెలంగాణా ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నవిజయశాంతి(Vijayasanthi)…. మరోసారి వెండితెరపై సందడి చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు భావేద్వేగంతో ఆమె చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. తన సోషల్ మీడియా అకౌంట్ ఎన్స్ ద్వారా అభిమానులను పలకరించిన విజయశాంతి… ‘నన్ను తమ ప్రాణంగా భావిస్తూ జన్మంతా ఎన్నడూ నా వెన్నంటి ఉంటూనే ఉన్న నా అభిమాన దైవాలకు ఎన్నటికీ తీర్చుకోలేని కృతజ్ఞతతో మీ కోసం…. నిజం చెప్పాలంటే మీ అభిమానం కోసం నేను మళ్లీ ఒక సినిమా చేస్తున్నాను. 5 దశాబ్ధాల ఈ నా సినీ ప్రయాణంలో మీ దీవెనలు ఎప్పటికీ ఉంటాయి. 1979 నుంచి నేటి వరకు ఉన్నట్లు.. మీ విజయశాంతి కళాకారిణిగా ఉన్నంతవరకు ఎప్పటికీ అట్లనే ఉంటాయని విశ్వసిస్తున్నా’ అంటూ ట్వీట్ లో రాసుకొచ్చారు. ఈ సందర్భంగా నందమూరి కల్యాణ్ రామ్, దర్శకుడు ప్రదీప్ చిలుకూరికి ఆమె అభినందనలు తెలిపింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కు తల్లిగా రాములమ్మ నటించనున్నట్లు సమాచారం.
Also Read : Hesham Abdul Wahab: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తున్న సంగీత దర్శకుడు