Vijay Varma : మిల్కీ బ్యూటీ తమన్నా, నటుడు విజయ్ వర్మ కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్న విషయం తెలిసిందే. త్వరలో పెళ్లి చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. దీనిపై విజయ్ వర్మ(Vijay Varma) తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘‘ బంధం ఏదైనా సరే.. ఇద్దరు వ్యక్తులు కలిసి సమయాన్ని ఆస్వాదించాలనుకున్నప్పుడు.. ఒకరిపై ఒకరికి అమితమైన ప్రేమ ఉన్నప్పుడు దానిని దాచి ఉంచాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో మా ఆలోచనలు ఒక్కటే. రిలేషన్‌షిప్‌ను గోప్యంగా ఉంచడం అంత ఈజీ కాదు. కలిసి బయటకు వెళ్లడానికి, ఫొటోలు తీసుకోవడానికి వీలు పడదు. నాకు అలాంటి పరిమితులు నచ్చవు. ఫీలింగ్స్‌ను బంధించడం నాకు ఇష్టం ఉండదు.
మా రిలేషన్ గురించి మేము పబ్లిక్‌గా అనౌన్స్ చేసినప్పటికీ చాలా విషయాలను ప్రైవేట్‌గానే ఉంచాం. మా ఇద్దరి ఫొటోలు నా వద్ద సుమారు 5000 ఉన్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడా వాటిని షేర్ చేయలేదు. ఎందుకంటే, అవి మాకు మాత్రమే సంబంధించినవి.ప్రస్తుతం పరిస్థితుల్లో పక్కవాళ్ల జీవితాల గురించి తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఎదుటివారి గురించే ఎక్కువగా ఆరాలు తీస్తుంటారు. ఇదొక అలవాటుగా మారిపోయింది. కాబట్టి దాన్ని నేను మార్చలేను. నేను వర్క్ చేసినంత కాలం ప్రేక్షకులు నా పనిని మెచ్చుకుంటే చాలు’’ అని అన్నారు.
Vijay Varma Comment
తమన్నా, విజయ్ వర్మ తొలిసారి ‘లస్ట్ స్టోరీస్ 2’ కోసం కలిసి పని చేశారు. చిత్రీకరణ సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ వెబ్‌సిరీస్ ప్రమోషన్స్‌లో తమన్నా.. విజయ్‌తో బంధం గురించి తెలియజేశారు. ‘‘ నా కోసం ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నా. నన్ను నన్నుగా అర్థం చేసుకునే విజయ్ వర్మ ఆ ప్రపంచంలోకి వచ్చాడు’’ అంటూ విజయ్‌తో ప్రేమలో ఉన్నట్లు తెలిపారు.
Also Read : Swara Bhasker : ‘హేమ కమిటీ’ అంశాలపై కీలక వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటి