Vijay Thalapathy : తమిళ సినీ సూపర్ స్టార్ దళపతి విజయ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తను ప్రస్తుతం దళపతి 69 మూవీ చేస్తున్నాడు. షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇటీవలే సినిమాకు సంబంధించి మూవీ మేకర్స్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. విడుదల చేసిన కొన్ని నిమిషాల్లోనే వరల్డ్ వైడ్ గా అత్యధికంగా వీక్షించారు. ఇదే సమయంలో తన సినీ కెరీర్ లో ఇదే చివరి సినిమా అని ప్రకటించాడు విజయ్(Vijay Thalapathy). దీంతో ఆఖరి చిత్రంపై ఆసక్తి పెరిగింది. మరింత ఉత్కంఠను రేపుతోంది. ప్రధానంగా తనకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు.
Vijay Thalapathy Movie…
వారి అంచనాలకు తగ్గట్టుగానే దళపతి 69 మూవీని తీసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు. ఇదే సమయంలో తను పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేశాడు. వచ్చే శాసన సభ ఎన్నికలను టార్గెట్ చేశాడు. ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా తన పార్టీని మరింత బలోపేతం చేసే పనిలో పడ్డాడు. ఇందుకు సంబంధించి చాప కింద నీరులా విస్తరించేలా ప్రయత్నం చేస్తున్నాడు దళపతి.
విజయ్ కు సినిమాల ద్వారానే లెక్కలేనన్ని ఆస్తులు ఉన్నట్లు అంచనా. కానీ ఆయన చాలా సింపుల్ గా ఉండేందుకే ఇష్టపడతాడు. ఇక రాబోయే చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. తనకు పెద్ద ఎత్తున రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేసినట్లు టాక్. ఇది పక్కన పెడితే ఇంకా రిలీజ్ కాకుండానే దళపతి69 మూవీ రికార్డ్ బ్రేక్ చేసింది. ఓవర్సీస్ లో ఏకంగా రూ. 75 కోట్లకు డీల్ కుదిరినట్లు సినీ వర్గాల టాక్. ఈ చిత్రాన్ని హెచ్. వినోద్ తీస్తున్నాడు. కన్నడ భామ బైజు విజయ్ సరసన నటిస్తోంది.
Also Read : Hero Mahesh-Priyanka : ప్రిన్స్ సరసన ప్రియాంకేనా