Vijay Sethupathi: హీరోగానే కాకుండా విలన్ గానూ కనిపించి… తనదైన శైలి నటనతో ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి. తమిళం, తెలుగు, హిందీ అని తేడా లేకుండా అన్ని భాషల్లో అటు హీరోగా, ఇటు విలన్ గా ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు.
ఉప్పెన వంటి తెలుగు స్ట్రైయిట్ సినిమాలతో పాటు… మాస్టర్, విక్రమ్, జవాన్ వంటి డబ్బింగ్ సినిమాల్లో తన నట విశ్వరూపం చూపించారు. దీనితో బుచ్చిబాబు సనా దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో కూడా విజయ్ సేతుపతికి విలన్ రోల్ లో కనిపించనున్నట్లు సమాచారం. అయితే గోవా వేదికగా జరుగుతోన్న ‘ఇఫి’ వేడుకల్లో పాల్గొన్న విజయ్ సేతుపతి… భవిష్యత్ లో విలన్ పాత్రలు పోషించడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Vijay Sethupathi – విజయ్ సేతుపతిని వేధిస్తోన్న ఎమోషనల్ ప్రెజర్ !
గోవా వేదికగా జరుగుతోన్న ‘ఇఫి’ వేడుకల్లో పాల్గొన్న విజయ్ సేతుపతి(Vijay Sethupathi)… విలన్ పాత్రలపై స్పందిస్తూ…. ‘‘తమ సినిమాలో విలన్‌గా నటించమని హీరోలు, దర్శకులు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు. డేట్స్, కాల్షీట్లు, ఇతరత్రా కారణాలతో ఒకవేళ ఒప్పుకోకపోతే వాళ్లు నాపై ఎమోషనల్ ప్రెజర్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఆ ఎమోషనల్ ప్రెజర్ ను ప్రస్తుతం నేను ఎదుర్కొవాలనుకోవడం లేదు.
విలన్ పాత్రలు పోషించడానికి నాకు బాధగా లేదు కానీ దానికి కొన్ని ఆంక్షలు ఉన్నాయి. వాళ్లు నన్ను కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. దీనితో ఇలాంటి పాత్రలు చేయాలా? వద్దా? అనే విషయంలో రాను రాను నేను అయోమయంలో పడ్డా. అందుకే కొన్నేళ్ల పాటు విలన్ పాత్రలు చేయకూడదని నిర్ణయించుకున్నా. ఇదే విషయాన్ని హీరోలకు గాని, దర్శకులకు గాని చెప్తుంటే… కనీసం స్క్రిప్ట్ అయినా వినండి అంటున్నారు. అక్కడే మళ్లీ సమస్య మొదలవుతుంది’’ అని విజయ్ సేతుపతి అన్నారు. దీనితో విజయ్ సేతుపతిని విలన్ రోల్ లో ఇష్టపడే అభిమానులు హర్ట్ అవుతున్నారు. విజయ్ సేతుపతి తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుండి హీరోగా… విలన్ గా మారిన విజయ్ సేతుపతి
1996లో విడుదలైన ‘లవ్‌బర్డ్స్’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విజయ్ సేతుపతి. ‘సుందరపాండియన్’తో తొలిసారి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘పిజ్జా’, ‘రమ్మీ’, ‘నేనూ రౌడీనే’, ‘విక్రమ్ వేద’, ‘96’, ‘పేటా’, ‘మాస్టర్’, ‘ఉప్పెన’, ‘విక్రమ్’, ‘మైఖేల్’, ‘జవాన్’ …తదితర చిత్రాల్లో హీరోగా, విలన్ గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ ప్రేక్షకులను మెప్పించారు. ఇటీవల ఫర్జీ అనే వెబ్ సిరీస్ తో ఓటీటీ ప్రేక్షకులకు కూడా అలరించారు.
Also Read : Allu Arjun: రాజమౌళి సినిమా రేంజిలో పుష్ప-2 బడ్జెట్ ?