Vijay Sethupathi: విలక్షణ నటుడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి(Vijay Sethupathi) నటించిన తాజా సినిమా ‘మహారాజ’. నిథిలన్ సామినాథన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ విలన్ గా నటించగా.. మమతా మోహన్ దాస్, నటరాజ్, భారతీరాజా, అభిరామ్ లాంటి వాళ్లు కూడా నటించారు. అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందించాడు. విజయ్ సేతుపతి కెరీర్ లో 50వ సినిమాగా తెరకెక్కించిన ఈ సినిమాను జూన్ 14న విడుదలై… బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. సుమారు 107 కోట్ల రూపాయలకు పైగా వసూళ్ళు సాధించి… ఈ ఏడాది బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇటీవల జూలై 12 నుండి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కు వచ్చి… ప్రస్తుతం టాప్ 10 స్ట్రీమింగ్ లిస్ట్ లో కొనసాగుతోంది.
అయితే బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న ‘మహారాజ’సినిమా… సినీ ప్రముఖులు, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను హిందీలో రీమేక్ కానుందని నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాదు దీనిని బీటౌన్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ఈ సినిమాను రీమేక్ చేయనున్నారట. ఇప్పటికే దీని హిందీ హక్కులను ఆయన కొనుగోలు చేసినట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వైవిధ్యమైన కథలను ఎంచుకోవడంలో ఆమిర్ ముందుంటారు. గతంలో ఆయన తండ్రి పాత్రలో నటించిన ‘దంగల్’ సూపర్ హిట్ గా నిలిచి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఇప్పుడు ‘మహారాజ’ను రీమేక్ చేస్తే ఇది కూడా ఆయన కెరీర్‌లో నిలిచిపోయే చిత్రమవుతుందని సినీప్రియులు భావిస్తున్నారు.
Vijay Sethupathi – ‘మహారాజ’ కథేమిటంటే ?
ఈ సినిమాలో మహారాజ అనే బార్బర్ పాత్ర పోషించారు విజయ్ సేతుపతి. మహారాజ (విజయ్ సేతుపతి) భార్య చనిపోగా.. అతడు తన కూతురు జ్యోతితో కలిసి జీవిస్తుంటాడు. ఓ రోజు హఠాత్తుగా మహారాజ పోలీస్ స్టేషన్‍కు వెళతాడు. తమపై ముగ్గురు దాడి చేశారని, తమ కూతురిని కాపాడిన లక్ష్మిని అపహరించుకు వెళ్లారని ఫిర్యాదు చేస్తాడు.
లక్ష్మిని కాపాడాలని కంప్లైంట్ ఇస్తాడు. అయితే, లక్ష్మి పోలికలను మహారాజ సరిగా చెప్పడు. దీంతో పోలీసులు ముందుగా ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరిస్తారు. ఆ తర్వాత కేసు నమోదు చేస్తారు. అసలు మహారాజ, అతడి కూతురుపై దాడి చేసిందెవరు.. లక్ష్మి ఎవరు.. చివరికి లక్ష్మిని పట్టుకున్నారా.. అనేదే ఈ మూవీలో ప్రధాన అంశాలు. మహారాజ సినిమాను ఆసక్తికర కథనంతో క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు దర్శకుడు నిథిలన్.
Also Read : Raayan: నెట్టింట వైరల్ అవుతోన్న ధనుష్‘రాయన్’ సక్సెస్ పార్టీ ఫొటోలు !