తమిళనాడులో అత్యంత జనాదరణ కలిగిన నటుడిగా గుర్తింపు పొందారు తలపతి జోసెఫ్ విజయ్. ఇప్పటికే ఆయన చేస్తున్న కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. పిల్లలకు చదువుతో పాటు అన్నాదురై, పెరియార్ రామస్వామి లాంటి వారిని పరిచయం చేయాల్సిన అవసరం ఉందన్నాడు. ప్రతి సినిమాలో ఏదో ఒక అంశాన్ని హైలెట్ చేస్తూ ప్రశ్నిస్తూ వస్తున్నాడు విజయ్.
తాజాగా తలపతి లోకేష్ కనగరాజ్ తో కలిసి లియో సినిమా తీశాడు. భారీ అంచనాల మధ్య లియో చిత్రం ట్రైలర్ విడుదలైంది. మాటల తూటాలు పేల్చాడు దర్శకుడు. ప్రధానంగా మొత్తం సినిమా అంతటా హీరో సమస్యలను ప్రస్తావించడం హైలెట్ గా నిలిచింది.
పైకి చెప్పక పోయినా అంతర్గతంగా రాబోయే ఎన్నికల్లో బరిలోకి దిగుతాడా అన్న అనుమానం విజయ్ పై కలుగుతోంది. సినిమాకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. విజయ్ చారిటీ కార్యక్రమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఆయన చదువు, ఆరోగ్యంపై ఎక్కువగా ఫోకస్ పెట్టాడు.
గతంలో అట్లీ కుమార్ తో తీసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ప్రస్తుతం లియో కూడా ట్రైలర్ లో రికార్డుల మోత మోగించింది. మొత్తంగా లియో సినిమా అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మరి ఎన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి.