Vijay Deverakonda: యుద్ధ విద్యలో శిక్షణ తీసుకుంటోన్న విజయ్‌ దేవరకొండ !

యుద్ధ విద్యలో శిక్షణ తీసుకుంటోన్న విజయ్‌ దేవరకొండ !

Hello Telugu - Vijay Deverakonda

Vijay Deverakonda: ‘టాక్సీవాలా’ వంటి బ్లాక్ బస్టర్ హిట్‌ తర్వాత హీరో విజయ్‌ దేవరకొండ, దర్శకుడు రాహుల్‌ సంకృత్యాన్‌ కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ(Vijay Deverakonda) ప్రస్తుతం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ స్పై థ్రిల్లర్‌ చేస్తున్నారు. ఇదిప్పుడు ముగింపు దశలో ఉంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే దర్శకుడు రాహుల్‌ సంకృత్యాన్‌ ప్రాజెక్ట్‌ ను పట్టాలెక్కించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ పీరియాడిక్‌ యాక్షన్‌ సినిమా నవంబరు నుంచి చిత్రీకరణ ప్రారంభించుకోనుంది. 19వ శతాబ్దపు నేపథ్యంలో 1854 – 1878 టైమ్‌ పీరియడ్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ ఉంటుందని, ఇందులో తండ్రీకొడుకులుగా విజయ్‌ ద్విపాత్రాభినయం చేస్తారనే టాక్‌ ఫిల్మ్‌ నగర్‌లో వినిపిస్తోంది.

Vijay Deverakonda Learning…

ఈ నేపథ్యంలోనే ఇప్పుడీ సినిమా చిత్రీకరణ కోసం ప్రత్యేకంగా సన్నద్ధమవుతున్నారు విజయ్‌. కథ రీత్యా ఇందులో ఆయన యోధుడిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. దీంట్లో యుద్ధ నేపథ్య సన్నివేశాలకు ప్రాధాన్యమున్నట్లు తెలిసింది. అందుకే ఈ పాత్ర కోసం విజయ్‌ గుర్రపు స్వారీలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారని సమాచారం. అంతేకాదు త్వరలో ఓ యుద్ధ విద్యలోనూ శిక్షణ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇది 18వ శతాబ్దంతో పాటు వర్తమాన కాలంతో ముడిపడి ఉన్న కథగా సాగనుందని… దీనికి తగ్గట్లుగా విజయ్‌ ఇందులో రెండు కోణాల్లో సాగే పాత్రలో కనువిందు చేయనున్నట్లు ప్రచారం సాగుతోంది. అంతేకాదు ఆయన ఈ సినిమా కోసం తొలిసారి రాయలసీమ యాసలో సంభాషణలు పలకనున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులు చకచకా సాగుతున్నాయి.

Also Read : Urvashi Rautela : నటసింహ బాలకృష్ణ పై ప్రశంసలు కురిపించిన బాలీవుడ్ హాట్ బ్యూటీ

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com